business
కొందరు పెట్రోల్ పంప్ యజమానులు చిప్‌లు ఉపయోగించి వినియోగదారులను మోసం చేస్తారు. ఈ చిప్‌ను మెషీన్‌లో అమర్చడం వల్ల ఇంధనం పరిమాణం తగ్గుతుంది. మీటర్ మాత్రం అదే ధర చూపిస్తుంది.
కొంతమంది పెట్రోల్ పంప్ ఉద్యోగులు మీటర్‌ను తప్పుగా చూపిస్తూ మోసం చేస్తారు. ఫ్యూయల్ మెషిన్ మీటర్‌ను 0కి సెట్ చేయకుండానే పెట్రోల్ పోయడం ప్రారంభిస్తారు.
పెట్రోల్ సాంద్రత 730-800 మధ్య ఉంటే అది స్వచ్ఛమైనది. ఇంధన మోసంలో కిరోసిన్ లేదా ఇతర పదార్థాలు కలపడం ద్వారా ఫ్యూయల్ డెన్సిటీ తగ్గిస్తారు.
పెట్రోల్ పంపుల్లో క్రెడిట్ కార్డ్ స్కిమ్మింగ్ చాలా సాధారణమైపోయింది. కార్డ్ మెషీన్‌కు ఒక సీక్రెట్ పరికరం ఉంటుంది. అది కార్డ్ వివరాలను దొంగిలిస్తుంది.
చాలా పెట్రోల్ బంకుల్లో సిబ్బంది కారు సైడ్ మిర్రర్‌ను బ్లాక్ చేయడం ద్వారా మోసం చేస్తారు. పెట్రోల్ లేదా డీజిల్ నింపుతున్నప్పుడు ఇది కూడా గమనించండి.
చాలా పెట్రోల్ పంపుల్లో కస్టమర్లకు నాసిరకం ఇంజిన్ ఆయిల్ అమ్ముతారు. కొంతమంది ఉద్యోగులు చౌకైన లేదా గడువు ముగిసిన ఆయిల్‌ను బ్రాండ్ల పేరుతో అమ్మేస్తుంటారు.
మీరు కార్డ్‌తో చెల్లిస్తుంటే కొన్నిసార్లు మెషీన్‌లో ఎర్రర్ చూపిస్తుంది. మళ్లీ చెల్లించమని అడుగుతుంది. కానీ డబ్బు మొదటిసారే కట్ అయి ఉంటుంది.
కొంతమంది పెట్రోల్ పంప్ ఉద్యోగులు మీ కారు ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్‌ను చౌకైన క్యాప్‌తో మారుస్తారు. దీనివల్ల పెట్రోల్ త్వరగా ఆవిరైపోతుంది.