వైవీ సుబ్బారెడ్డికి తిరుమల దర్శనాల సెగ: నివేదిక కోరిన ఎన్‌హెచ్‌ఆర్సీ

By telugu team  |  First Published Jul 17, 2020, 8:52 AM IST

తిరుమల దర్శనాలపై టిటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి సెగ తగులుతోంది. కోరనా వ్యాపిస్తున్న నేపథ్యంలో దర్శనాలను కొనసాగించడంపై రమణదీక్షితులు అభ్యంతరం చెప్పగా, తాజాగా హెచ్చార్సీ నివేదిక కోరింది.


తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డికి దర్శనాల సెగ తగులుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దర్శనాలు కొనసాగించడంపై ఆయన మీద పోరు ప్రారంభమైంది. రమణదీక్షితులు తిరుమల దర్శనాలు కొనసాగించడాన్ని తప్పు పట్టగా, దర్శనాలపై  జాతీయ మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) నివేదిక కోరింది.

తిరుమలలో ఆగమ శాస్త్ర పద్ధతులకు విరుద్ధంగా దర్శన నిబంధనలను మార్చి భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చేసిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ స్పందించిందని వనపర్తి జిల్లా ఆత్మకూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వై. తిప్పారెడ్డి తెలిపారు.

Latest Videos

undefined

Also Read: రమణదీక్షితులు వ్యాఖ్యలకు వైవీ సుబ్బారెడ్డి కౌంటర్

2005లో అప్పటి టీటీడీ పాలక మండలి లఘు దర్శనం, శీఘ్ర దర్శనం, బ్రేక్‌ దర్శనాల విధానాన్ని ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా అమలు చేయడం ప్రారంభించడంతో భక్తుల మనోభావాలు దెబ్బ తిన్నాయన్నారు. ఇది దేవాదాయ శాఖ చట్టం 142 ప్రకారం సమ్మతం కాదని ఈ నెల 3 న ఎన్‌హెచ్‌ఆర్‌సీ కి ఫిర్యాదు చేశానన్నారు. 

ఫిర్యాదు ను 14 వ తేదీన ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ విచారణకు స్వీకరించారన్నారు. తిరుమల దర్శన విధానాల్లో మార్పు లపై ప్రభుత్వ వైఖరి, తీసుకోనున్న చర్యల పై 8 వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఈ నెల 16 న‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని ఆదేశించారని తిప్పారెడ్డి తెలిపారు.

Also Read: చంద్రబాబు విధానాలనే అనుసరిస్తున్నారు. బాంబేసిన రమణదీక్షితులు

click me!