వరంగల్ లో దారుణం.. ఫ్రెండ్ పిలిచిందని వెళ్లిన వివాహిత, కారులో మత్తుమందు ఇచ్చి గ్యాంగ్ రేప్ చేసిన దుండగులు

By Asianet News  |  First Published May 3, 2023, 8:41 AM IST

వరంగల్ లో ఓ వివాహితపై పలువురు దుండుగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని ఆమెను హెచ్చరించారు.


వరంగల్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ వివాహితపై దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని ఆమెను బెదిరించారు. ఈ ఘటన గత నెలలోనే జరగగా.. ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ లోని పైడిపల్లి ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఓ కర్రీపాయింట్ లో పని చేస్తున్నారు. హనుమకొండలోని బీమారంలో ఆమె పని చేసే ప్రదేశం ఉంది. 

దారుణం.. ఐదుగురు చిన్నారులను బెదిరించి గ్యాంగ్ రేప్.. దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి..

Latest Videos

అయితే గత నెల 20వ తేదీన ఆమెకు ఓ ఫ్రెండ్ ఫోన్ చేసింది.. ఆరెపల్లికి రావాలని, ఓ పని ఉందని అందులో పేర్కొంది. దీంతో ఆ వివాహిత భర్త ఆమెను టూ వీలర్ పై ఎక్కించుకొని వచ్చి వదిలేశాడు. అనంతరం అక్కడి నుంచి ఆయన వెళ్లిపోయాడు. అంతకు ముందు నుంచే ఆమె ఫ్రెండ్ అక్కడ ఎదురు చూస్తున్నారు. కొంత సమయం తరువాత అక్కడికి ఓ కారు వచ్చింది. అందులో రవి, డి. నాగరాజు అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. కారు ములుగు జిల్లా బార్డర్ కు వెళ్లిపోయిన తరువాత ఆ వివాహిత ఫ్రెండ్ దిగిపోయింది. 

అదే ప్రదేశంలో ఎ.రమేశ్‌, బి.లక్ష్మణ్‌, బి.సుధాకర్‌ అనే వ్యక్తులు ఆ వాహనంలో కూర్చున్నారు. తరువాత బాధితురాలికి మత్తు ఇచ్చారు. దీంతో ఆమె అపస్మారస్థితిలోకి వెళ్లిపోయారు. ఆమె స్పృహలోకి వచ్చి చూస్తే.. మేడారం అడవిలో ఉన్నట్టు గుర్తించింది. ఆ తరువాత ఆమెపై ఎస్‌.రవి, డి.నాగరాజు, బి.లక్ష్మణ్‌ లు లైంగిక దాడికి ఒడిగట్టారు. మిగితా ఇద్దరు వారికి హెల్ప్ చేశారు. ఈ ఘటనను ఎవరికైనా తెలియజేస్తే చంపేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆమెను ములుగులో బస్సులో ఎక్కించి వెళ్లిపోయారు.

వార్నీ.. జీతం ఇవ్వలేదని మంత్రినే కాల్చేసిన బాడీగార్డ్.. ఎక్కడంటే ?

బాధితురాలు ఆరెపల్లి ప్రాంతంలో దిగి తన భర్తకు ఫోన్ చేసింది. ఎందుకింత లేట్ అయ్యిందని ఆమెతో భర్త అరిచాడు. దీంతో మనస్థాపంతో బాధితురాలు కరీంనగర్ జిల్లా రామడుగులో ఉన్న తన తల్లిగారింటికి వెళ్లిపోయారు. మూడు రోజులు గడిచినా తన భార్య ఇంటికి రాకపోవడంతో భర్త ఆందోళన చెందాడు. ఏప్రిల్ 25వ తేదీన ఎనుమాముల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

అన్ని రాష్ట్రాల విద్యార్థులు సమానమే.. కేంద్ర ప్రభుత్వ పరీక్షలన్నీ ప్రాంతీయ భాషల్లో ఉండాల్సిందే - స్టాలిన్

ఇదే సమయంలో బాధిత మహిళ తన కుల పెద్దలతో కలిసి భర్త దగ్గరకు వచ్చింది. తనపై జరిగిన దారుణాన్ని వివరించింది. దీంతో ఏప్రిల్ 29వ తేదీన 5 గురు వ్యక్తులపై ఎనుమాముల పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు.. నిందితులపై రేప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్ కు తరలించామని మామునూరు ఏసీపీ తాళ్లపల్లి కృపాకర్‌ మంగళవారం వెల్లడించారు. 

click me!