అమరావతికి వైఎస్ జగన్ టోకరా: అసలు వాస్తవం ఇదీ...

By telugu teamFirst Published Dec 26, 2019, 12:14 PM IST
Highlights

అమరావతి ప్రాంత రైతులు రోడ్డెక్కి మరి నిరసనలు తెలుపుతున్నారు. నేటికీ ఆ నిరసనలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అసలు అక్కడి ప్రజలు ముఖ్యంగా రైతులు అంతలా ఎందుకు నిరసనలు తెలుపుతున్నారు? వారి నిరసనలు సహేతుకమైనవేనా అనేది ఒకసారి చూద్దాం. 

ఏ ముహుర్తాన జగన్ మూడు రాజధానులు వచ్చే ఛాన్స్ ఉంది అని ప్రకటించాడో...ఆంధ్రప్రదేశ్ రాజకీయమంతా రాజధాని చుట్టే తిరుగుతోంది. అమరావతి ప్రాంత రైతులు రోడ్డెక్కి మరి నిరసనలు తెలుపుతున్నారు.

నేటికీ ఆ నిరసనలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అసలు అక్కడి ప్రజలు ముఖ్యంగా రైతులు అంతలా ఎందుకు నిరసనలు తెలుపుతున్నారు? వారి నిరసనలు సహేతుకమైనవేనా అనేది ఒకసారి చూద్దాం. 

జగన్ అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానికి ఒప్పుకున్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా రాజధాని మార్పు అని ఎక్కడా చెప్పలేదు. మ్యానిఫెస్టోను రూపొందించిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సైతం రాజధాని ఎక్కడికి పోదని ఇక్కడే ఉంటుందని అన్నారు. 

Also read: అమరావతికి జగన్ టోకరా: గ్రీన్ ఫీల్డ్ బ్రౌన్ ఫీల్డుల లోగుట్టు ఇదే...

ఇప్పుడు అధికారంలోకి వచ్చి 6నెలలైనా పూర్తికాకముందే రాజధానిపై పూర్తిగా డిఫరెంట్ వైఖరిని తీసుకున్నారు జగన్. ఇలా అధికారంలోకి రాగానే ప్రతి పార్టీ తమ సొంత అజెండాలను ప్రజల మీద రుద్దితే చాలా కష్టమవుతుంది.

వచ్చే ఎన్నికల్లో ఒకవేళ గనుక టీడీపీ నో లేక జనసేనో వేరే ఏదో పార్టీయో గనుక అధికారంలోకి వస్తే మరల రాజధానిని అమరావతికి తరలిస్తే అప్పుడు పరిస్థితేంటి? అప్పుడు విశాఖపట్నం ప్రజలు గొడవ చేయరా?

ఇక రైతుల విషయానికి వస్తే... వారు 33వేల ఎకరాలను ఇచ్చింది చంద్రబాబు నాయుడుకో, జగన్ మోహన్ రెడ్డికో కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. వారు ప్రభుత్వం తమ భూములను అభివృద్ధి చేసి ఇస్తారాణే నమ్మకంపైన బంగారం లాంటి 33వేల ఎకరాలను స్వచ్చంధంగా ఇచ్చారు. 

ఇప్పుడు ప్రభుత్వం అక్కడి నుంచి మార్చి విశాఖపట్నానికి తరలిస్తే తమ భూముల అభివృద్ధి ఆగిపోతుందని వారు నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వం స్పందించి వాటిని అభివృద్ధి చేసి ఇస్తామని చెప్పారు. 

ప్రభుత్వం దృష్టిలో ఇప్పుడు అభివృద్ధి అంటే ఏమిటి? రోడ్లు నిర్మించి,విద్యుత్ కనెక్షన్లిస్తే సరిపోతుందా? వారు తమ భూములను ఇచ్చింది అమరావతి వంటి మహానగరం వస్తుందనే ఒక ఆశతో, తమ భూములు అభివృద్ధి చెందితే వాటి ధరలు ఎక్కువవుతాయన్న ఉద్దేశంతో.

ఇప్పుడు కేవలం ఇక్కడ అసెంబ్లీ మాత్రమే నిర్మిస్తే అంతటి అభివృద్ధి జరుగుద్ద. అక్కడ కేంద్రంగా పాలనా జరిగినప్పుడు మాత్రమే అభివృద్ధి జరుగుతుంది తప్ప కేవలం అసెంబ్లీ మాత్రమే ఉంటె కాదు. అసెంబ్లీ సమావేశాలున్నప్పుడు అక్కడకు ఎమ్మెల్యేలు వాచిపోతారు తప్పితే మిగిలిన రోజుల్లో అక్కడ ఎవరూ ఉండరు. 

ఇప్పుడు కొద్దిసేపు ప్రభుత్వం చెప్పినట్టే భూములను అభివృద్ధి చేసి ఇచ్చిందనుకుందాం. ఆ భూములను వారు చాలా తక్కువకు అమ్ముకోవాల్సి వస్తుంది. దానితోపాటు ఇప్పుడు ప్రభుత్వం తిరిగి ఇచ్చేస్తానని చెబితే వారికి అప్పుడు కౌలు డబ్బులు కూడా చెల్లిస్తాం అన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాట కూడా తుంగలో తొక్కినట్టే కదా. 

ఇప్పుడు భూములను తిరిగి ఇవ్వాలనుకుంటే... ఒక చిన్న సమస్య కూడా ఉంది. భూములన్నిటిని కలిపి నిర్మాణాలు చేపట్టడం వల్ల ఎవరి భూమి ఎక్కడో కరెక్టుగా గుర్తుపట్టలేని పరిస్థితి. ఒకవేళ గుర్తుపట్టినప్పటికీ, వారికి ఇలా అసంపూర్తిగా నిర్మానయినా భవనాలను ఎం చేసుకుంటారు. ఆ భూములను రైతులు తీసుకొని ఎం చేస్తారు. వాటి మీద వ్యవసాయం ఎలా చేస్తారు?

Also reads: రాజధానా, ప్రత్యేక రాష్ట్రమా.. తేల్చుకోండి: జగన్‌కు గ్రేటర్ రాయలసీమ నేతల లేఖ

పోనీ ప్రభుత్వమే ఆ భావనాలన్నిటిని కూలగొట్టి మొత్తం నేలను చదును చేసి ఇచ్చిందనే అనుకుందాం. ఆ భూములు గతంలో ఉన్నట్టు సారవంతంగా ఉంటాయా? బలమైన పునాదులకోసం కాంక్రీట్, ఇనుము ఇతర నిర్మాణ సామగ్రితో నిండిపోయి ఉన్న భూమి వ్యవసాయానికి ఎలా పనికొస్తుంది?

రైతులిప్పుడు అటు సంవత్సరానికి మూడుపంతాలను పండించే జరీ భూములను కోల్పోయి, వస్తుంది అనుకున్న అమరావతి మహానగరం రాక రెంటికి చెడ్డ రేవడిలా మజారింది వారి బ్రతుకు. 

అభివృద్ధి చేయడానికి వీలుగా అమరావతిని ఎడ్యుకేషనల్ హబ్ గా మారుస్తామని ప్రభుత్వం చెబుతుంది బాగానే ఉంది. అక్కడ విద్యాలయాలను ఏర్పాటు చేస్తారు. అందుకోసం అనువైన అన్ని మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అవన్నీ ఆలా అభివృద్ధి చేసినప్పుడు అమరావతిలోని రాజధానిని ఉంచొచ్చు కదా. 

ఇప్పటికే అక్కడ ఎలాగూ శాసనసభ కడతామని అంటున్నారు. మంత్రుల క్వార్టర్స్ కూడా కడతామని ప్రభుత్వం చెబుతుంది. ఇప్పటికే తాత్కాలిక సచివాలయం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు చెప్పినట్టు ఆకాశంలో ఉన్న అమరావతి స్థాయిలో కాకున్నా ఒక సాధారణ రాజధానిని మాత్రం నిర్మించవచ్చు. 

వేచి చూడాలి జగన్ ప్రభుత్వం ఎల్లుండి జరిగే కాబినెట్ భేటీలో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. 

click me!