Farm Laws: మన దేశంలో చట్టాన్ని ఎలా రద్దు చేస్తారో తెలుసా?

By telugu teamFirst Published Nov 19, 2021, 1:35 PM IST
Highlights

మూడు సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. రైతు సంఘాలు ఆ ప్రకటనను స్వాగతించాయి. కానీ, మన దేశంలో చట్టాల రద్దు ప్రక్రియ ఎలా ఉంటుందనే చర్చ కూడా ఈ తరుణంలో ఊపందుకుంది. రాజ్యాంగంలోని 245 ఆర్టికల్ ఏ చట్టాన్ని అయినా రద్దు చేసే అధికారాన్ని పార్లమెంటుకు కల్పిస్తున్నది. ఒక చట్టాన్ని రూపొందించడానికి పార్లమెంటులో బిల్ పాస్ చేసినట్టుగానే దాన్ని రద్దు చేయడానికీ పార్లమెంటులోనే బిల్ ప్రవేశపెట్టి పాస్ చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
 

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి Narendra Modi ఈ రోజు ఉదయం జాతిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. సుమారు ఏడాదిపాటు ఢిల్లీ సరిహద్దులో ఆందోళనలు చేస్తున్న Farmers డిమాండ్‌ను స్వీకరించారు. ఆ మూడు సాగు చట్టాలను రద్దు(Repeal) చేస్తామని ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే, Parliamentలో చట్టాల రద్దు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆందోళనలు (Protestts) కొనసాగుతాయని స్పష్టం చేశాయి. అంతేకాదు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వాలనే డిమాండ్ కూడా ఉన్నదని, దానిపై తమతో ప్రభుత్వం చర్చించాలని డిమాండ్ చేశాయి. ఈ రోజు ఇప్పటి వరకు చూచాయగా జరిగిన సంగతులు. కానీ, ఈ సంచలన ప్రకటనతోపాటు మన దేశంలో చట్టాన్ని రద్దు చేస్తే దాని ప్రక్రియ ఎలా ఉంటుందనే విషయంపైనా చర్చ జరుగుతున్నది. రాజ్యాంగంలోని అధికరణం 245 ఏ చట్టాన్ని అయినా రద్దు చేసే అధికారాన్ని పార్లమెంటుకు కల్పిస్తున్నది. ఈ చట్ట రద్దు ప్రక్రియపై కొందరు నిపుణులు సమాధానాలు ఇలా ఉన్నాయి.

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 29వ తేదీన ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 23న జరిగే అవకాశం ఉన్నది. ఈ సమావేశాల్లోనే సాగు చట్టాల(Farm Laws)ను రద్దు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. అయితే, ఈ చట్టాల రద్దు ప్రక్రియ ఎలా ఉంటుందనే విషయంపై న్యాయ నిపుణులు సీనియర్ జూరిష్ట్ సుభాష్ కాశ్యప్ ఇలా చెప్పారు. ఒక చట్టాన్ని రూపొందించినట్టుగానే చట్టం రద్దు ప్రక్రియ ఉంటుందని వివరించారు. పార్లమెంటులో రద్దుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుందని, దానిపైనా చర్చ జరుగుతుందని తెలిపారు. అనంతరం దానికి ఓటింగ్ నిర్వహిస్తారని అన్నారు. అయితే, ఎప్పటిలోగా ఇది పాస్ అవుతుందనేది చెప్పలేమని, ఎందుకంటే ప్రతిపక్షాలు చర్చలు జరపడానికి సుముఖంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని వివరించారు.

Also Read: farm laws repeal: మూడు వ్యవసాయ చట్టాల రద్దు.. సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ

వీటి కంటే ముందు.. ముందు చట్టాల రద్దుకు సంబంధించిన ప్రతిపాదనను న్యాయ శాఖకు సంబంధిత మంత్రిత్వ శాఖ పంపుతుందని, న్యాయపరమైన అంశాలను లా మినిస్ట్రీ చూస్తుందని తెలిపారు. తర్వాత సంబంధిత మంత్రిత్వ శాఖ ఆ ప్రతిపాదిత బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతారని అన్నారు.

ఒక చట్టాన్ని రూపొందించడానికి ఏ అధికారమైతే పార్లమెంటుకు ఉంటుందో అదే అధికారం దాన్ని రద్దు చేయడానికి వీలు కల్పిస్తుందని కేంద్ర మాజీ న్యాయ శాఖ కార్యదర్శి పీకే మల్హోత్రా వివరించారు. మూడు చట్టాలను ఒకే బిల్లుతో రద్దు చేయవచ్చునని లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ పీడీటీ ఆచార్య తెలిపారు. అందుకే మూడు సాగు చట్టాలను రద్దు చేయడానికి ఒక బిల్లును తేవాల్సి ఉంటుందని అన్నారు. ఆ బిల్లులోని కారణాలు, అభ్యంతరాల పట్టికలో ఆ సాగు చట్టాలను ఎందుకు రద్దు చేస్తున్నారో ప్రభుత్వం పేర్కొనాల్సి ఉంటుందని వివరించారు. ఒక్క సారి ఆ మూడు చట్టాల రద్దు బిల్లు పాస్ అయితే, అది కూడా స్వయంగా ఒక చట్టమవుతుందని తెలిపారు.

Also Read: Farm Laws: ఆందోళనలు ఆగవు.. చట్టాల రద్దు సరే.. మద్దతు ధరపైనా మాతో చర్చించాలి: రైతులు

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాలు ఇప్పుడు అమల్లో లేవు. కానీ, వాటికి పార్లమెంటు ఆమోదం ఉన్నది. అలాగే, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర కూడా ఉన్నది. కాబట్టి, వాటిని కేవలం పార్లమెంటులోనే రద్దు చేయాల్సి ఉంటుందని మల్హోత్రా తెలిపారు.

click me!