ఓ భర్త తన భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఆమెకు బ్లూ ఫిల్మ్ లు చూపిస్తూ అందులో ఉన్నట్టుగా తన ఫ్రెండ్స్ తో కలిసి గ్రూప్ సెక్స్ లో పాల్గొనాలని ఒత్తిడి తెచ్చాడు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఆమె ఓ టీచర్. కొంత కాలం కిందట ఓ వ్యక్తితో వివాహం జరిగింది. కొన్నాళ్ల తరువాత భర్త ఆమెను వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. బ్లూ ఫిల్మ్ లు చూపించేవాడు. తన ఫ్రెండ్స్ ను ఇంటికి పిలిపించేవాడు. వారితో గడపాలని ఒత్తిడి తెచ్చేవాడు. పోర్న్ ఫిల్మ్ లో చూపించిన విధంగా గ్రూప్ సెక్స్ లో పాల్గొనాలని వేధింపులకు గురిచేశాడు. అతడి చేష్టలతో విసిగిపోయిన ఆ మహిళ పోలీసు అధికారులను ఆశ్రయించింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు రాజధాని చెన్నై నగరం పరిధిలోని పులియంతోపులో ఓ మహిళ తన భర్తతో కలిసి జీవిస్తోంది. ఆమె టీచర్ గా పని చేస్తున్నారు. అయితే కొంత కాలం నుంచి ఆమె భర్త నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని తాజాగా ఆమె పోలీసులకు వెల్లడించారు. కీల్పాక్ డిప్యూటీ పోలీసు కమిషనర్ ఆఫీసులో శనివారం ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఓ మహిళ హాజరై పోలీసుల ఎదుట తన గోడు వెళ్లబోసుకుంది.
భర్తను పక్క గదిలో బంధించి.. భార్యపై 11 మంది సామూహిక అత్యాచారం
కొంత కాలం నుంచి భర్త తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. భర్త తన ఫ్రెండ్స్ ను ఇంటికి తీసుకొస్తున్నారని, వారితో ఆనందంగా గడాలని బలవంతం చేస్తున్నాడని ఆమె పోలీసులతో తెలిపింది. దీంతో పాటు పోర్న్ ఫిల్మ్స్ చూపిస్తున్నాడని పేర్కొంది. అందులో ఉన్నట్టు తన ఫ్రెండ్స్ తో కలిసి గ్రూప్ సెక్స్ లో పాల్గొనాలని ఒత్తిడి చేస్తున్నాడని చెప్పారు.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాటించిన విలువలు అందరికీ స్ఫూర్తిదాయకం - కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
అతడి వేధింపులు తట్టుకోలేక తాను పెరియమేడు పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె పోలీసు ఉన్నతాధికారులతో తెలిపింది. కానీ వారి పట్టించుకోవడం లేదని ఆరోపించింది. ఇప్పటికైనా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీంతో ఆమెకు పోలీసులు సర్దిచెప్పారు. ఫిర్యాదును తప్పకుండా పరిశీలించి, నిందితుడిపై చర్యలు తీసుకుంటామని ఆమె పంపించేయాలని ప్రయత్నించగా.. బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. భర్తపై కఠినంగా చర్యలు తీసుకోవాని ఏడుస్తూ, కింద పడి అటూ ఇటూ పొర్లాడింది. స్పందించిన పోలీసులు దీనిపై తక్షణం చర్యలకు ఉపక్రమిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆమెను అక్కడి నుంచి పంపించారు.