crimes against women: మ‌హిళ‌ల‌పై పెరుగుతున్న హింస‌.. 2021లో 30 వేల‌కు పైగా ఫిర్యాదులు: ఎన్‌సీడ‌బ్ల్యూ

By Mahesh Rajamoni  |  First Published Jan 1, 2022, 3:44 PM IST

crimes against women: దేశంలో మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం అనేక చ‌ట్టాలు ఉన్నాయి. కానీ వారిపై హింస మాత్రం త‌గ్గ‌డం లేదు. క‌రోనా స‌మ‌యంలోనూ (2021) మ‌హిళ‌ల‌పై హింస పెరుగుతున్నది  జాతీయ మ‌హిళా క‌మిష‌న్ వెల్ల‌డించింది. 2021లో మ‌హిళ‌పై చోటుచేసుకున్న నేరాల‌కు సంబంధించి దాదాపు 31,000 కు పైగా ఫిర్యాదులు అందాయి. ఇందులో స‌గానికి పైగా యూపీకి చెందిన‌వే కావ‌డం గ‌మ‌నార్హం.
 


crimes against women: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం కొన‌సాగుతున్న సమ‌యంలోనూ మ‌హిళ‌ల‌పై హింస పెరిగింద‌ని జాతీయ మ‌హిళా క‌మిష‌న్ త‌న నివేదిక‌లో పేర్కొంది. మహిళలపై నేరాలకు సంబంధించి గ‌తేడాదిలో దాదాపు 31,000 ఫిర్యాదులు త‌మ‌కు అందాయ‌ని జాతీయ మహిళా కమిషన్ (NCW) పేర్కొంది. మ‌హిళ‌పై నేరాల‌కు సంబంధించి 2014 తర్వాత అత్యధికం ఫిర్యాదులు అంద‌డం ఇదే మొద‌టిసారి. అయితే, మ‌హిళ పై నేరాల‌కు సంబంధించి అందిన ఈ ఫిర్యాదుల్లో స‌గానికి పైగా ఒక్క ఉత్త‌ర‌ప్ర‌దేశ్ చెందిన‌వే కావ‌డం అక్క‌డి దారుణ ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతోంది. అంత‌కు ముందు ఏడాదితో పోలిస్తే ఈ ఫిర్యాదులు గ‌ణ‌నీయంగా పెరిగాయి. మ‌హిళ‌ల‌పై నేరాల‌కు 23,722 ఫిర్యాదులు అందిన 2020తో పోలిస్తే 2021లో మహిళలపై నేరాల ఫిర్యాదులు 30 శాతం పెరిగాయి.

Also Read: CM YS Jagan: అలాంటి వాళ్లు పేదల గురించి ఆలోచించే వాళ్లేనా? సినిమా టికెట్ రేట్ల తగ్గింపుపై సీఎం జగన్..

Latest Videos

undefined

జాతీయ మ‌హిళా క‌మిష‌న్ (NCW) అధికారికి  డేటా ప్రకారం.. మ‌హిళ‌ల‌పై నేరాల‌కు సంబంధించి అందిన ఫిర్యాదుల్లో గరిష్టంగా 11,013 స్త్రీల మానసిక వేధింపులను పరిగణనలోకి తీసుకునే గౌరవంగా జీవించే హక్కుకు భంగం క‌లిగించే అంశానికి సంబంధించినవి ఉన్నాయి. వీటి త‌ర్వాత అధికంగా 6,633 గృహ హింసకు ఫిర్యాదులు ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో వరకట్న వేధింపులకు సంబంధించి 4,589 ఫిర్యాదులు అందాయ‌ని క‌మిష‌న్ పేర్కొంది. మ‌హిళ‌పై ప‌లు రాష్ట్రాల్లో హింస గ‌ణ‌నీయంగా పెరుగుతున్న‌ద‌ని గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి. ఉత్త‌ర‌ప్రదేశ్‌లో మ‌హిళ‌ల ర‌క్ష‌ణ దారుణంగా ఉంద‌ని ఎన్‌సీడ‌బ్ల్యూ డేటా వెల్ల‌డిస్తున్న‌ది. అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై నేరాలకు సంబంధించి అత్యధికంగా 15,828 ఫిర్యాదులు నమోదయ్యాయి. మొత్తంగా స‌గానికి సైగా ఫిర్యాదులు ఒక్క యూపీ నుంచి అంద‌డం గ‌మ‌నార్హం. యూపీ త‌ర్వాత అధికంగా  ఢిల్లీలో 3,336, మహారాష్ట్రలో 1,504, హర్యానాలో 1,460, బీహార్‌లో 1,456 ఫిర్యాదులు నమోదయ్యాయి.

Also Read: World Census: 9 సెకన్లకు ఒకరి జననం.. ప్రపంచ జనాభా ఎంతకు పెరిగిందో తెలుసా?

మొత్తం ఫిర్యాదుల్లో యూపీ నుంచి అధికంగా రాగా, వాటిలో గౌరవంగా జీవించే హక్కు, గృహ హింసకు సంబంధించి ఫిర్యాదులు ఎక్కువ‌గా ఉన్నాయి. 2014 నుంచి ఎన్‌సీడబ్ల్యూకి వచ్చిన ఫిర్యాదుల సంఖ్య అత్యధికం  2021లోనే వ‌చ్చాయి. 20214లో మ‌హిళా క‌మిష‌న్‌కు 33,906 ఫిర్యాదులు అందాయి. కమిషన్ తన పని గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తున్నందున ఫిర్యాదులు పెరిగాయని జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చీఫ్ రేఖాశర్మ అన్నారు. “మహిళలకు సహాయం చేయడానికి కొత్త కార్యక్రమాలను ప్రారంభించడాన్ని కమిషన్ ఎల్లప్పుడూ ముందుంటుంది. దీనికి అనుగుణంగా, అవసరమైన మహిళలకు సహాయక సేవలను అందించడానికి మేము 24 గంట‌ల పాటు సేవ‌లు అందించేందుకు హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించాము. దీని ద్వారా కూడా ఫిర్యాదులు న‌మోదు చేసుకోవ‌చ్చు”అని శర్మ చెప్పారు.

Also Read: Vaishno Devi Stampede: వైష్ణోదేవి ఆలయ విషాదానికి ఆదే కార‌ణ‌మా?.. అసలు ఏం జరిగింది?  

మొత్తం ఫిర్యాదుల్లో 2021లో జూలై నుండి సెప్టెంబరు వరకు, ప్రతి నెలా 3,100కి పైగా ఫిర్యాదులు అందాయి. దేశంలో #MeToo ఉద్యమం ఉధృతం అయిన త‌ర్వాత గ‌త‌ నవంబర్ 3,000 ఫిర్యాదులు అందాయి. ఎన్‌సీడ‌బ్ల్యూ డేటా ప్రకారం.. మహిళలపై అనాగరికత లేదా వేధింపుల నేరాలకు సంబంధించి 1,819 ఫిర్యాదులు, అత్యాచారం, అత్యాచార యత్నాలకు సంబంధించి 1,675 ఫిర్యాదులు, మహిళలపై పోలీసుల ఉదాసీనతపై 1,537, సైబర్ నేరాలకు సంబంధించి 858 ఫిర్యాదులు అందాయి.

Also Read: coronavirus: భారత్ పై కరోనా పంజా.. 22వేలకు పైగా కొత్త కేసులు.. ఒమిక్రాన్ ఆందోళన !

click me!