హెల్మెట్‌లపై జీఎస్టీని రద్దు చేయండి.. నిర్మలా సీతారామన్‌ కు ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ లేఖ

By team teluguFirst Published Jan 19, 2023, 5:57 PM IST
Highlights

భారత్ లో హెల్మెట్లపై అధికంగా జీఎస్టీ ఉండటం వల్ల వాటి ధరలు ఎక్కువగా ఉంటున్నాయని ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. దీని వల్ల ప్రజలు తక్కువ ధరలో ఉండే హెల్మెట్ లు కొనుగోలు చేస్తున్నారని తెలిపింది. హెల్మెట్లపై జీఎస్టీని రద్దు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిని ఆ సంస్థ కోరింది. 

వచ్చే కేంద్ర బడ్జెట్ (2023-24)లో ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం లైఫ్ సేవింగ్ డివైజ్ హెల్మెట్‌లపై జీఎస్టీని తొలగించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను రోడ్ సేఫ్టీ బాడీ ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ (ఐఆర్‌ఎఫ్) కోరింది. ఈ మేరకు కేంద్ర మంత్రికి గురువారం ఆ సంస్థ లేఖ రాసింది. 

రెజర్ల సమస్యలను సీరియస్‌గా తీసుకుంటాం : హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్

‘‘రోడ్డు ప్రమాదాల్లో 31.4 శాతం ద్విచక్రవాహనదారులు తలకు తగిలిన గాయాల కారణంగానే మరణిస్తున్నారు. ద్విచక్ర వాహన ప్రమాద గాయాలు, మరణాలు తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన చర్యలలో ఒకటి ప్రామాణిక హెల్మెట్ల వాడకం’’ అని ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ (ఐఆర్ఎఫ్) ప్రెసిడెంట్ కెకె కపిల ఆ లేఖలో పేర్కొన్నారు.

రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. 22న డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రాజీనామా!

‘‘దేశంలో హెల్మెట్ వినియోగం తక్కువగా ఉన్నట్లు తేలింది. ద్విచక్ర వాహనదారులు చాలా మంది ఆర్థికంగా వెనుకబడిన, తక్కువ ఆదాయ వర్గాలకు చెందినవారు. దీని వల్ల తక్కువ ధర, నాణ్యత లేని హెల్మెట్‌లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఈ హెల్మెట్‌లు చాలా వరకు రైడర్‌ల ప్రాణాలను కూడా కాపాడలేవు’’ అని ఆమె తెలిపారు.

‘‘ ప్రస్తుతం హెల్మెట్లపై జీఎస్టీ రేటు 18 శాతంగా ఉంది. రోడ్డు భద్రత ప్రతిపాదకుడిగా హెల్మెట్లపై జీఎస్టీ ఉండకూడదని గట్టిగా సిఫార్సు చేస్తున్నాను. ఇది ప్రామాణిక హెల్మెట్లను ప్రజలకు తక్కువ ధరకు అందించడానికి సహాయపడుంది. నాసిరకం హెల్మెట్లను కొనుగోలు చేయకుండా చూస్తుంది. ఇది ద్విచక్ర వాహనదారుల రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే రోడ్డు ప్రమాదాల వల్ల మన ఆర్థిక వ్యవస్థకు కలిగే నష్టాన్ని పూడ్చడానికి సాయపడుతుంది. ’’ అని అని కపిల లేఖలో పేర్కొన్నారు.

జిమ్‌లో వర్కవుట్ చేసుకుంటూనే కుప్పకూలాడు.. మహారాష్ట్రలో వ్యక్తి మృతి

కాగా.. కేంద్ర మోటారు వాహన చట్టం 1988 సెక్షన్ 129 ప్రకారం ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాద మరణాలలో 11 శాతం భారతదేశంలోనే సంభవిస్తున్నాయని, దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు 15.71- 38.81 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లుతోందని ‘బాష్’ తన తాజా నివేదికలో పేర్కొంది.

click me!