విహారయాత్రకు వెళ్లి, సెల్పీ తీసుకుంటుండగా వివాహితపై 8 మంది గ్యాంగ్ రేప్, రూ.45 వేలు కూడా దోచుకెళ్లిన దుండగులు

By Asianet News  |  First Published Jul 15, 2023, 2:05 PM IST

తన బంధువులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఓ వివాహితపై 8 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె దగ్గరి నుంచి రూ.45 వేలను కూడా దోచుకెళ్లారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. 


మహారాష్ట్రలోని బుల్దానాలో దారుణం జరిగింది. ఓ వివాహితపై 8 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె నుంచి నగదును కూడా దోచుకెళ్లారు. బాధితురాలు తమ బంధువుతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

అమానవీయం.. గిరిజనుడి చెవిలో మూత్ర విసర్జన..యూపీలో ఘటన, నిందితుల అరెస్టు

Latest Videos

‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.  ఓ వివాహిత తన బంధువుతో కలిసి గురువారం బుల్దానాలోని సుందరమైన రాజూర్ ఘాట్ కు విహారయాత్రకు వెళ్లింది. ఆమె తన బంధువులతో కలిసి సెల్ఫీలు దిగుతుండగా ఎనిమిది మంది నిందితులు అక్కడికి వచ్చారు. బంధువులందరినీ కత్తితో బెదిరించారు. కర్రలతో దాడి చేసి గాయపర్చారు. అనంతరం వివాహితను బెదిరించి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. తరువాత ఆమె వద్ద ఉన్న రూ.45 వేల నగదును కూడా దోచుకెళ్లారు.

ముగిసిన ప్రధాని మోడీ ప్రాన్స్ పర్యటన.. ఫ్రెంచ్-ఇండియా స్నేహం చిరకాలం కొనసాగుతుందంటూ మాక్రాన్ ట్వీట్దీంతో బాధితురాలు బోరఖేడి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. జరిగిన దాడిని వివరించింది. అయితే ఈ ఘటనపై పోలీసులు గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరిని మోహెగావ్ కు చెందిన రాహుల్ రాథోడ్ గా పోలీసులు గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. బుల్ధానా పోలీసులు ఫోరెన్సిక్ బృందాన్ని, స్నిఫర్ డాగ్ ను ఘటనా స్థలానికి పిలిపించారు. నిందితులందరి కోసం బుల్దానా ఎస్పీ సునీల్ కడస్నే పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

జనగామ బీజేపీ నేత తిరుపతిరెడ్డి అదృశ్యం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుడిపై ఆరోపణలు చేస్తూ కుటుంబ సభ్యుల ఆందోళన

కాగా.. ఘటనా స్థలాన్ని ఎస్పీ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  ఈ ఘటనపై గ్యాంగ్ రేప్ నేరం నమోదైందని తెలిపారు. కానీ గ్యాంగ్ రేప్ జరగలేదని తెలుస్తోందని అన్నారు. బాధితురాలు వైద్య పరీక్షలకు నిరాకరించిందని అన్నారు. తనపై లైంగిక దాడి జరగలేదని శుక్రవారం తెలిపిందని చెప్పారు. ఈ అభియోగాలు తరువాత ఎత్తివేస్తామని అన్నారు. కానీ కచ్చితంగా దోపిడీ జరిందని అన్నారు. 

click me!