మహారాష్ట్రలోని సతారా జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై 11 మంది దుండుగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జీవనోపాధి కోసం భర్త, కుమారుడితో పాటు వలస వచ్చిన ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టారు.
మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులకు భయం వేయడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు వెలుగులో వస్తూనే ఉన్నాయి. చిన్నారులు, ముసలివాళ్లు అని కూడా చూడకుండా మగాళ్లు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. దివ్యాంగులు అని జాలి కూడా చూపకుండా అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఓ మహిళా కార్మికురాలుపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. భర్తను బంధించి మరీ ఈ దారుణానికి ఒడిగట్టారు.
వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లా సుదగఢ్ కు చెందిన 26 ఏళ్ల గిరిజన మహిళ తన భర్త, ఐదేళ్ల కుమారుడితో కలిసి అదే రాష్ట్రంలోని సతారా జిల్లాలకు వలస వెళ్లారు. అక్కడి ఓ బొగ్గు ఫ్యాక్టరీలో పనికి కుదిరారు. ప్రతీ రోజు అక్కడ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సమీపంలోని ఓ ఇంట్లో వారు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో జూన్ 19వ తేదీన దాదాపు 11 మంది నిందితులు ఈ కుటుంబం నివసించే ఇంటికి చేరుకున్నారు.
యూసీసీ తీసుకురావడం ఆర్టికల్ 370 రద్దు చేసినంత సులువు కాదు - గులాం నబీ ఆజాద్
ఆమె భర్తను ఓ గదిలో బంధించి, వారంతా సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ తర్వాత దంపతులు తమ కుమారుడి సాయంతో అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్నారు. అనంతరం బాధితురాలు ఆమె భర్త ఫాల్తాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. మిగితా నిందితుల కోసం గాలిస్తున్నారు.