ఆర్ కామ్ దివాళా .... అనిల్ అంబానీ రాజీనామా

By Sandra Ashok Kumar  |  First Published Nov 16, 2019, 7:15 PM IST

ఆర్ కామ్ డైరెక్టర్ గా అనిల్ అంబానీ పదవి విరమణ. ఇప్పటికే 30,142 కోట్ల దివాళా తీయడంతో అమ్మకానికి  సిద్దంగా ఉన్న ఆర్ కామ్.అనిలా అంబానీకి చెందిన అనేక సంస్థలు కూడా నష్టాల బాటలోనే పయనిస్తున్నాయి.  అనిల్ అంబానీకి చెందిన మిగిలిన సంస్థలకు కూడా ఆర్ కామ్ భారీగా బకాయిపడ్డది. ఇందుకోసమని ఆస్తులను తాకట్టు పెట్టాలని లేదా అమ్మేయాలని అనిల్ అంబానీ గతంలోనే నిర్ణయించారు.


ఆర్ కామ్ డైరెక్టర్ గా అనిల్ అంబానీ పదవి విరమణ. ఇప్పటికే 30,142 కోట్ల దివాళా తీయడంతో అమ్మకానికి  సిద్దంగా ఉన్న ఆర్ కామ్.రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరుభాయి అంబానీ మరణాంతరం రిలయన్స్ గ్రూపులను అన్నదమ్ములైన ముఖేష్ అంబానీ అనిల్ అంబానీలు పంచుకున్నారు.2005లో జరిగిన ఈ పంపకాల్లో ముఖేష్ కు టెలికాం రంగానికి చెందిన కంపెనీ ఆర్ కామ్ దక్కలేదు. అది తన తమ్ముడైన అనిల్ అంబానీకి దక్కింది. అసలు ఆర్ కామ్ ఏర్పాటు చేయడంలో అన్నీ తానై ముందుండి నడిపింది ముఖేష్ అంబానీయే.

కానీ పంపకాల్లో అది అనిల్ అంబానీ పాలయ్యింది. అంతేకాకుండా ముఖేష్ అంబానీ పది సంవత్సరాలపాటు టెలికాం రంగంలోకి అడుగు పెట్టొద్దు అనే ఒప్పందం కూడా కుదిరింది. అప్పటికే ఒక ఊపు ఊపుతున్న రిలయన్స్ నెట్వర్క్ అనిల్ సొంతమయినప్పటికీ, ఇప్పుడు దాని పరిస్థితేంటో మనందరికీ తెలుసు.అప్పుల ఊబిలో కూరుకుపోయి దివాలా తీసింది.అన్నదమ్ములు ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం ముగిసిన వెంటనే రంగంలోకి దిగిన ముఖేష్ అంబానీ సెప్టెంబర్ 2016లో రిలయన్స్ జియోను ప్రారంభించాడు.

Latest Videos

మార్కెట్లో ఉన్న మిగిలిన నేటివరకులను తట్టుకోలేక అనిల్ అంబానీ కంపెనీ ఆర్ కామ్ మూతపడే స్థాయికి చేరుకుంది, ఇప్పటికే దివాళా తీసింది. రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించిన ఒక ఒప్పందం కుదిరింది కూడా. కాకపోతే రోజు రోజుకి పెరుగుతున్న అప్పులు, వాటిపైన వడ్డీ భారం, మార్కెట్ను జియో ఊపేస్తున్న వైనం అన్ని వెరసి అనిల్ అంబానీ కంపెనీ ఆర్ కామ్ ను కోలుకోలేని దెబ్బతీశాయి. 

మార్కెట్లో ప్రస్తుత తరుణంలో ఐడియా-వోడాఫోన్, ఎయిర్టెల్, జియో మూడు కంపెనీలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంత తక్కువ రేట్లకు తమ కంపెనీ సేవలను అందించలేకపోవడంతోపాటు, ఉన్న యూజర్లు కూడా వేరే నెట్వర్క్ లకు మారుతున్నారు. ఈ పోటీని తట్టుకొని నిలవడం కష్టమని భావించిన అనిల్ అంబానీ ఆర్ కామ్ కంపెనీ పదవికి రాజీనామా చేసి కంపెనీని అమ్మకానికి పెట్టాడు.

also read ఈ- కామర్స్ దిశగా రిలయన్స్ స్పీడప్: హైదరాబాదీ స్టార్టప్ కైవసం ?

అనిలా అంబానీకి చెందిన అనేక సంస్థలు కూడా నష్టాల బాటలోనే పయనిస్తున్నాయి.  అనిల్ అంబానీకి చెందిన మిగిలిన సంస్థలకు కూడా ఆర్ కామ్ భారీగా బకాయిపడ్డది. ఇందుకోసమని ఆస్తులను తాకట్టు పెట్టాలని లేదా అమ్మేయాలని అనిల్ అంబానీ గతంలోనే నిర్ణయించారు. అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు ముంబైలోని  అతి విలాసవంతమైన భవన సముదాయం  విక్రయించడం గానీ, అద్దెకివ్వడమో చేయాలని యోచిస్తున్నారట.

తద్వారా  కొన్ని అప్పులు తీర్చాలని అనిల్ అంబానీ భావిస్తున్నారు. అందులో భాగంగా ముంబైలో ప్రస్తుతం అడాగ్ గ్రూపునకు ప్రధాన కార్యాలయంగా వినియోగిస్తున్న ఈ భవనాన్ని లీజు ప్రాతిపదికన అప్పగించడం లేదంటే మంచి బేరం వస్తే విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బీఎస్‌ఈకి సమచారం ఇచ్చింది.దీర్ఘకాలిక లీజు కింద భవనాన్ని అప్పగించడం ద్వారా వచ్చిన మొత్తాన్ని రుణ భారం తగ్గించుకునేందుకు వినియోగించుకోనుంది.

2020 నాటికి రుణ రహిత సంస్థగా మారేందుకు రిలయన్స్‌ ఇన్‌ఫ్రా లక్ష్యం నిర్దేశించుకుంది. ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేలో 7లక్షల  చదరపు అడుగుల విస్తీర్ణంలో అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన శాంటాక్రూజ్ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ భవనం అమ్మకం లేదా లీజు కోసం గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థల గ్రూపు సంస్థ బ్లాక్‌స్టోన్ , యుఎస్ ఆధారిత ఫండ్‌తో చర్చలు జరుపుతున్నట్టు తాజా నివేదిక చెబుతున్నాయి.  

తద్వారా రిలయన్స్ ఇన్ ఫ్రా రూ. 1,500-2,000 కోట్ల నగదు సమకూర్చుకోనుందని ఒక ఆంగ్ల దినపత్రిక రాసిన కథనం పేర్కొంది. మరోవైపు ఈ భవనం కూడా చట్టపరమైన  వివాదాల్లో చిక్కుకున్న నేపథ్యంలో ఈ లావాదేవీ పూర్తి చేయడం కోసం ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ జెఎల్‌ఎల్‌ను కూడా నియమించుకుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న దక్షిణ ముంబైలోని తన బల్లార్డ్ ఎస్టేట్ కార్యాలయానికి తిరిగి వెళ్లాలని కూడా అనిల్ అంబానీ ఆలోచిస్తున్నారని సమాచారం. ఈ వార్తల నేపథ్యంలో అడాగ్‌ గ్రూపు షేర్లు భారీగా నష్టపోయాయి.

ఈ ఒప్పందం పూర్తయితే శాంతాక్రూజ్‌ నుంచి దక్షిణ ముంబైలోని బెల్లార్డ్‌ ఎస్టేట్‌కు ప్రస్తుత కార్యాలయాన్ని మారుస్తారు. ముంబై వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న రిలయన్స్‌ గ్రూపు కార్యాలయాలకు ఉద్యోగులనూ తరలిస్తారు.ఇదిలా ఉంటే అవసరమైతే ఆస్తులను విక్రయించైనా సరే రుణాలు తిరిగి చెల్లిస్తానని ఇటీవల అనిల్‌ అంబానీ ప్రకటించిన సంగతి విదితమే. ఇందులో భాగంగానే రిలయన్స్‌ గ్రూపు వేగంగా పావులు కదుపుతున్నట్లు పలువురు భావిస్తున్నారు. 

also read  దేశీయ ఎగుమతుల్లో వరుసగా మూడో నెల కూడా క్షీణత

రిలయన్స్‌ సెంటర్‌ కార్యాలయ భవనం 6.95 లక్షల చదరపు అడుగుల స్థలంలో పరివేష్టితమై ఉంది. ఇక్కడ ఒకేసారి 425 కార్లు పార్కింగ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ముంబై వెస్ట్రన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేకు పక్కనే ఉండటంతోపాటు ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 15 నిమిషాల ప్రయాణ దూరంలో ఉంది. అంటే దేశీయ విమానాశ్రయ టెర్మినల్‌కు 10 నిమిషాల్లో చేరుకోవచ్చు బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌కు చేరుకోవాలంటే కేవలం 20 నిమిషాల ప్రయాణం మాత్రమే.

త్వరలో రాబోతున్న శాంతాక్రజ్‌ మెట్రో స్టేషన్‌ పక్కనే రిలయన్స్ అడాగ్ గ్రూప్ కార్యాలయ భవనం ఉంది. న్యూఢిల్లీ-ఆగ్రా టోల్‌ రహదారిని క్యూబ్‌ హైవేస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థకు విక్రయించనున్నట్లు ఇటీవల రిలయన్స్‌ ఇన్‌ఫ్రా ప్రకటించింది. వచ్చేనెల చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి, రూ.3,600 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. గత ఏడాది ముంబైలో ఉన్న ఇంధన వ్యాపారాన్ని రూ.18,800 కోట్లకు అదానీ ట్రాన్స్‌మిషన్‌కు విక్రయించింది. దీంతో రుణ భారాన్ని రూ.22వేల కోట్ల నుంచి తగ్గించుకుంది. 

సరిగ్గా 11 ఏళ్ల క్రితం 2008లో 42 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 6వ ధనవంతుడైన అనిల్ అంబానీ కూడా గత నెలలో కుబేరుల క్లబ్ నుంచి కిందికి జారుకున్నారు. 2018 మార్చి నాటికి  రిలయన్స్ గ్రూప్ కంపెనీల మొత్తం రుణం రూ.1.7 లక్షల కోట్లకు పైగా ఉంది.11 ఏళ్లలో అనిల్ అంబానీ మొత్తం వ్యాపార సామ్రాజ్యం ఈక్విటీ విలువ రూ. 3,651 కోట్లకు (23 523 మిలియన్లు) కుప్పకూలింది. 2005లో  రిలయన్స్ సామ్రాజ్యాన్ని అన్న ముకేశ్‌ అంబానీలో విభజించుకోవాలని నిర్ణయించుకున్న తరువాత అనిల్‌ అంబానీకి ఈ కార్యాలయం లభించింది.

click me!