టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు: ఎవరి లెక్కలు వారివి....

By narsimha lode  |  First Published Mar 12, 2024, 11:27 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు నెలకొంది. మూడు పార్టీలు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే దానిపై  స్పష్టత వచ్చింది.


అమరావతి:  త్వరలో జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని  తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేనలు నిర్ణయం తీసుకున్నాయి.  మూడు పార్టీల మధ్య సీట్ల షేరింగ్ కూడ  కుదిరింది.

also read:సికింద్రాబాద్- విశాఖ రూట్‌లో మరో రైలు: కొత్తగా 10 వందే భారత్ రైళ్లు ప్రారంభించిన మోడీ

Latest Videos

undefined

తెలుగుదేశం పార్టీ  144 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ  10 అసెంబ్లీ, ఆరు ఎంపీ స్థానాల్లో బరిలోకి దిగనుంది. జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో  రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది.2019 ఎన్నికల్లో  తెలుగు దేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసింది.  బీజేపీ కూడ ఒంటరిగానే బరిలోకి దిగింది.  సీపీఐ, సీపీఐ(ఎం), బీఎస్‌పీలతో కలిసి  జనసేన పోటీ చేసింది.

also read:40 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు: సోషల్ మీడియాలో వీడియో వైరల్

2019 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మారిన పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం,జనసేన తొలుత కూటమిగా ఏర్పడ్డాయి. బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు, ,పవన్ కళ్యాణ్ లు చర్చలు జరిపారు.  ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి.

also read:పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన లారీ: ఆరుగురు మృతి,పది మందికి గాయాలు

కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం)లు కూటమిగా పోటీ చేసే అవకాశం ఉంది.  వైఎస్ఆర్‌సీపీ ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా తమకు నష్టం లేదని వైఎస్ఆర్‌సీపీ చెబుతుంది.  ఈ దఫా వైఎస్ఆర్‌సీపీని ఇంటికి పంపుతామని  టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ప్రకటిస్తున్నారు.

also read:పరీక్షలో పాస్ చేయండి లేకపోతే పెళ్లి చేస్తారు: ఆన్సర్ షీట్ లో ఓ విద్యార్ధిని వేడుకోలు

2019 ఎన్నికల్లో  వైఎస్ఆర్‌సీపీకి  50.6 శాతం ఓట్లు వచ్చాయి. 151 అసెంబ్లీ స్థానాల్లో  ఆ పార్టీ విజయం సాధించింది.  తెలుగు దేశం పార్టీకి  39.7 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీ కేవలం  23 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.  జనసేన పార్టీ ఒకే ఒక్క అసెంబ్లీ స్థానంలో విజయం సాధించింది.  ఆ పార్టీకి  5.6 శాతం ఓట్లు దక్కాయి. బీజేపీకి 0.84 శాతం ఓట్లు వచ్చాయి. కమలం పార్టీ ఒక్క స్థానంలో కూడ విజయం సాధించలేదు. కాంగ్రెస్ పార్టీకి 1.17 శాతం ఓట్లు దక్కాయి.

గత ఎన్నికల్లో  వైఎస్ఆర్‌పీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. గత ఎన్నికల సమయంలో ఈ మూడు పార్టీలకు  వచ్చిన ఓట్ల శాతం  గత ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీకి వచ్చిన ఓట్ల శాతం కంటే తక్కువగా ఉంది. అయితే  గత ఎన్నికల నాటికి ఇప్పటికి  రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  

మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్‌సీపీ తరపున వై.ఎస్. షర్మిల ప్రచారం చేశారు. అయితే ఈ దఫా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా వై.ఎస్. షర్మిల  బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు  వైఎస్ఆర్‌సీపీ వైపు మళ్లింది.  అయితే  వైఎస్ఆర్‌సీపీ వైపు మళ్లిన ఓటు బ్యాంకును తిరిగి తమ పార్టీ వైపునకు తెచ్చేందుకు  కాంగ్రెస్ వ్యూహలు రచిస్తుంది.   కాంగ్రెస్ కు ఓట్ల శాతం పెరిగితే   వైఎస్ఆర్‌సీపీకి పరోక్షంగా నష్టం జరిగే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలను  రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే అదే సమయంలో  ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువగా చీలితే పరోక్షంగా వైఎస్ఆర్‌సీపీకి దోహదపడే  అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

also read:టీడీపీ-బీజేపీ-జనసేన సీట్ల షేరింగ్‌లో స్వల్పమార్పులు: ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందంటే?

ఐదేళ్ల పాటు తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఓట్లను కురిపిస్తాయని వైఎస్ఆర్‌సీపీ అభిప్రాయంతో ఉంది.  2014, 2019లో కూడ తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగిన విషయాన్ని  వైఎస్ఆర్‌సీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే  జగన్ పాలనపై అసంతృప్తితో ఉన్న వర్గాలు తమకు పట్టం కడుతారని టీడీపీ కూటమి నేతలు  విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 
 

click me!