ఇలా రెండు రంగుల కలయికగా కనపడుతున్న గాజులు ఈ కాలం అమ్మాయిలకు బాగా నచ్చుతాయి. గోల్డ్, డైమండ్స్ కాంబినేషన్ లో ఈ గాజులు తయారు చేశారు.
పట్టుచీరలు కట్టినప్పుడు ఇలాంటి ట్రెడిషనల్ మోడల్ గాజులు అయితే పర్ఫెక్ట్ గా ఉంటాయి. చేతులకు నిండుగానూ ఉంటాయి.
లక్ష్మీదేవి రూపంతో నెక్ సెట్ లు మాత్రమే కాదు.. ఇలా గాజులు కూడా డిజైన్ చేయించుకోవచ్చు. ఇవి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న మోడల్.
రాజస్థానీ గాజులు చేతులకు అందం, గౌరవం తెస్తాయి. రంగురంగుల రాళ్లతో మీనాకారీ గాజులు చాలా బాగుంటాయి. ఏ చీర, సూట్, లెహంగాకైనా సరిపోతాయి.
డమరు డిజైన్ మీనాకారీ గాజులు రోజూ వాడుకోవడానికి బాగుంటాయి. తేలికగా, ఆధునికంగా ఉండే గాజులు కావాలంటే ఇవి బెస్ట్. ఆఫీస్ కి, పార్టీకి బాగుంటాయి.
నెమలి డిజైన్ గాజులు చాలా అందంగా ఉంటాయి. లాక్-మోటిఫ్ వర్క్ తో చేసిన ఈ గాజులను మట్టి గాజులతో పాటు వేసుకోవచ్చు.