Asianet News TeluguAsianet News Telugu

వరంగల్ కు మాస్టర్ ప్లాన్ ఇదీ...: కేటీఆర్ వివరణ

వరంగల్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. ఆ మాస్టర్ ప్లాన్ ఎలా ఉంటుందనే విషయాన్ని కేటీఆర్ వివరించారు. 

Master plan for Warangal: KTR announces
Author
Hyderabad, First Published Sep 28, 2019, 5:18 PM IST

హైదరాబాద్: వరంగల్ క్రమానుగత పట్టాణాభివృద్దికి,భవిష్యత్తు అవసరాలకు అనుగణంగా కాకతీయ అర్బన్ డెవల్ మెంట్ అథారిటీ (కుడా) మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు తెలిపారు. భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నగరాల అభివృద్ధి ప్రణాళికలు ఉండాలని, ఈమేరకు తెలంగాణలో రెండో పెద్ద నగరం వరంగల్ సమగ్రాభివృద్ధికి అనుగుణంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్ తుది దశకు చేరుకున్నదని తెలిపారు. 

"

వరంగల్ మాస్టర్ ప్లాన్ ముసాయిదాపై(డ్రాప్ట్ మాస్టర్ ప్లాన్) పైన మంత్రి కేటీఆర్... కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ( కుడా ) పరిధిలోని మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో శనివారం హైదరాబాద్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో పురపాలక శాఖ మంత్రి కెటియార్ స్వయంగా మాస్టర్ ప్లాన్ గురించి ప్రజాప్రతినిధులకు వివరించారు. 

మాస్టర్ ప్లాన్ అనేది నగరాల అభివృద్ధికి కీలకమైనదని. భవిష్యత్తు తరాలకు ఉపయోపడేలా, నగరాలు సమగ్ర అభివృద్ధి సాధించేలా మాస్టర్ ప్లాన్ ఉండాలన్నారు. వరంగల్ మాస్టర్ ప్లాన్ ముసాయిదాపై అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నామని, ఇప్పటికే కుడా పరిధిలోకి వచ్చే వివిధ వర్గాలు, భాగస్వాములతో విస్తృతంగా చర్చించిన తర్వతా మాస్టర్ ప్లాన్ ముసాయిదాను తయారు చేశామన్నారు. 

ఇప్పటిదాకా సూమారు నాలుగువేల సూచనలు, సలహాలు, అభ్యంతరాలు మాస్టర్ ప్లాన్ రూపకల్పన సందర్భంగా వచ్చాయని, వీటిని సానూకూలంగా తీసుకుని నగర సమగ్రాభివృద్ది కోసం ఈ ముసాయిదాను తయారు చేశామన్నారు. వరంగల్ ప్రస్తుత ముసాయిదా మాస్టర్ ప్లాన్ 2041 సంవత్సరం వరకు కావల్సిన అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించామన్నారు. 

ఈ సమావేశంలో మాట్లాడిన మంత్రి కెటియార్ వరంగల్ నగరానికి ఉన్న చారిత్రక ప్రత్యేకతను... పర్యావరణ, పురావస్తు అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ, చెరువులు, రోడ్లు, కాలనీల విషయంలో క్షున్నంగా అధ్యయనం చేయాలన్నారు. మాస్టర్ ప్లాన్ ఆమోదం అనంతరం జీఐఎస్ లో అనుసంధానం చేస్తామన్నారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదాలోని అంశాలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా వ్యవస్థను ఎర్పాటు చేసి, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక నోడల్ అధికారి ఎర్పాటు చేసి స్ధానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలన్నారు. స్థానికంగా ప్రజల నుంచి వచ్చే సలహాలను  పరిశీలించాని పురపాలకశాఖాధికారులకు అదేశాలు జారీ చేశారు.  

ఈ సందర్భంగా మాస్టర్ ప్లాన్ విజన్, దాని ద్వారా ప్రతిపాధిస్తున్న మౌలిక సౌకర్యాలను వివరించారు. 

మాస్టర్ ప్లాన్ ముసాయిదాలో రేడియల్ రోడ్లను అవుటర్ రింగ్ రోడ్డుకు  కలుపుతూ అద్భుతమైన రోడ్డు వ్యవస్ధను ఎర్పాటు చేసేందుకు వీలుందన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గ్రోత్ కారిడార్లు, ఇండస్ట్రియల్ జోన్ల ఏర్పాటు వంటి అంశాలను వివరించారు. భవిషత్తు అవసరాలకు అనుగుణంగా కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ పనితీరును మార్చుకోవాలని, వరంగల్ నగరాన్ని అభివృద్ధికి అవసరమైన నిధులను సమీకరించుకునేలా ప్రణాళికలు ఉండాలన్నారు. 

ఇందుకోసం హెచ్ఎండీఏ తరహాలో ల్యాండ్ పూలింగ్, భూహక్కుల బదిలీ విధానం వంటి కార్యక్రమాలను చేపట్టాలన్నారు.  క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా పక్కా సమాచారంతో మాస్టర్ ప్లాన్ ముసాయిదాలో అంశాలను చేర్చాలని. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల పరిధిలోని అంశాలపై కుడాకు ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు. 

 పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... 'నగరంలో చెరువులను, రోడ్లను కచ్చితంగా గుర్తించాలి. ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డును అనుసంధానించేందుకు అవసరమైన రవాణా మార్గాలను చేర్చాలన్నారు. 

భవిష్యత్ తరాలకు అనుగుణంగా, వారు మెచ్చుకునేలా వరంగల్ మాస్టర్ ప్లాన్ ఉండాలి. అన్ని వర్గాల ప్రతిపాదనలు, సూచనలను, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని చెప్పారు. ఎమ్మెల్యేలు, అధికారులు సమన్వయంతో వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. 
అక్టోబరు 5న మంత్రి కేటీఆర్ గారి వరంగల్ నగర పర్యటన అంశాలపై ఆయనతో ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు చర్చించారు. ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసే ప్రాజెక్టులను వివరించారు. 

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వైద్య - ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నన్నపునేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రైతు రుణవిమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, కుడా వైస్ చైర్మన్ ఎన్.రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

"

Follow Us:
Download App:
  • android
  • ios