Asianet News TeluguAsianet News Telugu

అర్థనగ్నంగా నడిరోడ్డుపై యువతి రీల్స్.. ట్రాఫిక్ జాం అయినా పట్టించుకోకుండా డ్యాన్స్.. ఓ యువకుడు చేసిన పని వైరల్

నడిరోడ్డుపై అర్థనగ్నంగా డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేస్తుందో యువతి. దీంతో ట్రాఫిక్ జాం అయ్యింది. ఇది గమనించి ఓ యువకుడు చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. 

Young woman half naked reels on road goes viral - bsb
Author
First Published Jul 31, 2023, 9:35 AM IST

విచిత్రమైన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. లేదా వైరల్ అవ్వడానికి కూడా కొంతమంది ప్రయత్నం పూర్వకంగా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు.  అలాంటి కోవలోకే వస్తుంది తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో. ఓ యువతి నడిరోడ్డుపై అర్థనగ్నంగా డాన్స్ చేయడం మొదలుపెట్టింది. డాన్స్ లో భాగంగా కాస్త వంగింది…  అప్పటివరకు సీన్లో లేని ఓ యువకుడు ఎక్కడి నుంచో ఉడిపడ్డాడు.  

వంగిన ఆ అమ్మాయి బ్యాక్ మీద గట్టిగా ఒకటి ఇచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు  సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇది చూస్తుంటే.. నాగార్జున హీరోగా వచ్చిన హలో బ్రదర్ సినిమా సీన్ గుర్తొస్తుంది కదా. అది రీల్ కోసం సృష్టించిన సీన్ అయితే.. ఇది రియల్ సీన్. అందులో.. నాగార్జున.. ఎవరి బ్యాకైనా చూస్తే వెంటనే గట్టిగా లాగిపెట్టి ఒక్కటిస్తాడు. అందులో నాగార్జున డ్యూయల్ రోల్ కావడంతో.. తాను ప్రేమించిన నాగార్జున ఎవరో తెలుసుకోవడం కోసం రమ్యకృష్ణ అతని ముందు వంగి పరీక్ష పెట్టడం కూడా ఉంటుంది. అయితే ఇదంతా సరదాగా సాగిపోతుంది. 

కానీ రియల్ లైఫ్ లో కూడా అలాంటి సీన్ కనిపించడం.. నెటిజన్లు రకరకాల కామెంట్స్ తో మాట్లాడడం.. ఈ వీడియోలో చూడొచ్చు. ఇంతకీ ఆ వీడియోలో ఉన్న విషయం ఏంటంటే.. ఓ యువతి రీల్స్ చేస్తుంది. దీంట్లో భాగంగా నడిరోడ్డు మీద అర్ధ నగ్నంగా డాన్స్ చేయడం మొదలుపెట్టింది.  ఎవరిని పట్టించుకోకుండా రోడ్డంతా తనదే అన్నట్టుగా.. డాన్స్ చేస్తూ దాన్ని వీడియోలు తీస్తూ వయ్యారాలు వలకబోస్తోంది. నడిరోడ్డుపై ఆమె రీల్స్  షూటింగ్ మొదలు పెట్టడంతో ట్రాఫిక్ ఎక్కడిదక్కడ స్తంభించిపోయింది.

అయినా అదేమీ పట్టించుకోకుండా ఆమె తన పని తాను చేసుకుంటూనే ఉంది. అప్పటివరకు చేస్తున్న స్టెప్ మార్చి.. మరో స్టెప్పు మొదలుపెట్టింది. వంగుతూ డ్యాన్స్ చేస్తోంది. ఇది చూసిన ట్రాఫిక్ లో ఉన్న ఓ అబ్బాయికి చిరాకు వచ్చిందో మరేమో కానీ.. సడన్గా బైకు తోలుకుంటూ రయ్ మంటూ వచ్చాడు. ఆమె బ్యాక్ మీద గట్టిగా లాగి ఒకటి ఇచ్చాడు. వెంటనే.. అక్కడ నుంచి ఎంత స్పీడుగా వచ్చాడో అంతే స్పీడుగా వెళ్లిపోయాడు.

ఆ దెబ్బ కాస్త గట్టిగానే తగలడంతో… డాన్స్ చేస్తున్న యువతి గట్టిగా నొప్పి భరించలేక కేక పెట్టింది. ఈ హఠాత్పరిణామానికి వెంటనే వీడియోని రికార్డ్ చేస్తున్న వ్యక్తి కూడా రికార్డింగ్ ఆపేశాడు. ఈ వీడియోని బోర్ణ కాంగ్ అనే ట్విట్టర్ అకౌంట్లో ఓ యూజర్ షేర్ చేశాడు. క్యాప్షన్ గా.. అబ్బాయి చేసిన పనిని తప్పు పట్టలేమంటూ రాసుకొచ్చాడు. ఇంకేముంది నెటిజన్లు ఈ వీడియోని చూస్తూ వైరల్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు.

రకరకాల కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. ‘నడిరోడ్డు మీద ఈ డ్యాన్సులు ఏంటి… ట్రాఫిక్కు ఇబ్బంది కలిగిస్తూ జనాలను ఇరుకుల్లో పెడుతూ చేస్తే ఇలాగే జరుగుతుంది’.. అని కొందరు అంటే… ‘అమ్మాయిలతో ఇలాగేనా ప్రవర్తించేది..’ అంటూ మరికొందరు అబ్బాయిని తప్పుపడుతున్నారు. ఇక మరికొందరేమో.. ‘ఆడు మగాడ్రా బుజ్జి’ అంటూ… కామెంట్ చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios