Asianet News TeluguAsianet News Telugu

ఆకలితో వీగన్ రా ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మృతి...

దశాబ్ద కాలంగా వీగన్ రా ఫుడ్ ఇన్ ఫ్లుయెన్సర్ గా ప్రభావం చూపించిన గ్జానా శాన్సనోవా ఆకలితో మరణించింది. 

Vegan raw food influencer dies of starvation - bsb
Author
First Published Aug 1, 2023, 1:21 PM IST

గ్జానా శాన్సనోవా అనే 39 ఏళ్ల వీగన్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆకలితో మృతి చెందింది. ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమె సోషల్ మీడియాలో వీగన్ రా ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్. అయితే, సంవత్సరాల తరబడి పూర్తిగా పచ్చి శాకాహారం మాత్రమే తినడం వల్ల ఆకలితో మరణించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. 

న్యూయార్క్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం, రష్యన్ జాతీయురాలైన గ్జానా శాన్సనోవా  తన సోషల్ మీడియా ఖాతాలలో పచ్చి కూరగాయలు, పండ్లు లాంటి ముడి ఆహారాలమీద ప్రచారం చేస్తుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఆన్‌లైన్‌లో గ్జానా డీ'ఆర్ట్ అనే పేరుతో ఈమె ఇన్ ఫ్లుయెన్సర్ గా ఉంది. ఆమె ఆగ్నేయాసియా పర్యటనలో ఉండగా అస్వస్థతకు గురై.. వైద్య చికిత్స పొందుతూ.. చివరికి జూలై 21న మరణించినట్లు తెలిసింది.

జోకర్ వేషంలో.. ‘సరదా’ కోసం కదులుతున్న ట్రైయిన్ లో 13మందిని విచక్షణారహితంగా కాల్చి చంపాడు..

గ్జానా శాన్సనోవా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రకారం, కనీసం ఒక దశాబ్దం పాటు అన్ని రకాల పచ్చి శాఖాహారాన్నే తీసుకుంటుంది. "కొన్ని నెలల క్రితం, శ్రీలంకలో ఉన్పప్పుడు.. ఆమె అప్పటికే అలసిపోయినట్లు కనిపించింది, ఉబ్బిన కాళ్ళతో శోషవచ్చినట్టుగా కనిపించింది" అని ఒక స్నేహితుడు అన్నాడు. 

"దీంతో ఆ టూర్ వాళ్లు ఆమెను చికిత్స కోసం ఇంటికి పంపారు. అయితే, ఆమె మళ్లీ పారిపోయింది. నేను ఆమెను ఫుకెట్‌లో మళ్లీ చూశాను. చాలా పాడైపోయింది.. నేను భయపడ్డాను" అని చెప్పుకొచ్చారాయన.

ఆమె స్నేహితురాలు ప్రకారం.. "నేను ఆమె పై అంతస్తులోనే ఉంటాను. ఏదో రోజు నేను ఆమె నిర్జీవదేహం కనిపిస్తుందని భయపడేదాన్ని. అందుకే ఆమెను ఒప్పించి, చికిత్సకు పంపించాను. కానీ, ఫలితం లేకపోయింది"

గ్జానా శాన్సనోవా తల్లి తన కుమార్తె "కలరా లాంటి ఇన్ఫెక్షన్" వల్ల చనిపోయిందన్నారు. అయితే మరణానికి గల కారణాలు అధికారికంగా వెల్లడి కాలేదు. గ్జానా శాన్సనోవా అలసట, శాకాహార ఆహారం ఆమె శరీరంపై ఒత్తిడి పెరిగిందని నమ్ముతున్నట్లు ఆమె తల్లి వెచెర్న్యాయ కజాన్‌తో చెప్పారు.

న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, గత ఏడు సంవత్సరాలుగా, ఇన్‌ఫ్లుయెన్సర్ జెయింట్, స్వీట్ జాక్‌ఫ్రూట్, దురియన్‌ను మాత్రమే తినేదని ఒక సన్నిహిత మిత్రుడు చెప్పాడు.

"నా శరీరం, మనస్సు ప్రతిరోజూ రూపాంతరం చెందడాన్ని నేను గమనిస్తున్నాను" అని గ్జానా శాన్సనోవా తన నిర్బంధ ఆహార నియమాన్ని వివరిస్తూ గతంలో చెప్పుకొచ్చింది. ‘‘కొత్తగా మారిన నన్ను నేను ప్రేమిస్తున్నాను. నా పాత అలవాట్లకు ఎప్పటికీ వెళ్లను" అని కూడా చెప్పుకొచ్చింది. గ్జానా శాన్సనోవా రా డైట్ సిద్ధాంతాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేసేది. 

Follow Us:
Download App:
  • android
  • ios