Asianet News TeluguAsianet News Telugu

బండి సంజయ్ అరెస్టు: ఇరికారా, ఇరికించారా?

ఎస్ఎస్సీ ప్రశ్న పత్రం లీకేజీ కేసులో పోలీసులు బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్టు చేశారు. 

ఎస్ఎస్సీ ప్రశ్న పత్రం లీకేజీ కేసులో పోలీసులు బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్టు చేశారు. ఈ కేసులో బండి సంజయ్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ జైలు నుంచి బయటకు వస్తారా, లేదా అనే ఉత్కంఠకు తెరపడింది. కేసులో కుట్రపూరితంగా తనను ఇరికించారని బండి సంజయ్ అంటున్నారు. కాదు, ప్రభుత్వం పరువు తీయడానికి ప్రశ్న పత్రం లీకేజీకి ఆయన తెర తీశారని పోలీసులు అంటున్నారు. ఇదే సమయంలో సింగరేణి కాలరీస్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శనివారంనాడు బిఆర్ఎస్ మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఈ స్థితిలో ప్రధాని మోడీ తన కార్యక్రమాల్లో రాజకీయాలు మాట్లాడుతారా, లేదా అనే ఉత్కంఠ నెలకొని ఉంది.