Asianet News TeluguAsianet News Telugu

ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తప్పుకున్న ఒసాకా.. పెళ్లి కాకుండానే తల్లి అవుతున్న టెన్నిస్ స్టార్

Naomi Osaka: నాలుగు సార్లు గ్రాండ్ స్లామ్ విజేత, జపాన్ సంచలనం  నవోమి  ఒసాకా  త్వరలో మెల్‌బోర్న్ వేదికగా జరుగబోయే ఆస్ట్రేలియా ఓపెన్  నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఒసాకా ఈ టోర్నీ నుంచి  తప్పుకోవడానికి గల కారణాలను వివరించింది.  

Naomi Osaka Reveals Why She withdrawal From Australian Open 2023
Author
First Published Jan 12, 2023, 4:14 PM IST

జపాన్ టెన్నిస్ స్టార్, నాలుగు గ్రాండ్ స్లామ్ లను గెలుచుకున్న  నవోమి ఒసాకా  తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ట్విటర్ ఖాతా వేదికగా వెల్లడించింది. త్వరలో మెల్‌బోర్న్ వేదికగా జరుగబోయే  ఆస్ట్రేలియా ఓపెన్ లో   ఆమె పాల్గొనడం లేదన్న వార్తల నేపథ్యంలో  ఆమెకు  ఈ టోర్నీ నుంచి  ఎందుకు తప్పుకుందో తెలియక అభిమానులు,  టోర్నీ నిర్వాహకులు  ఆందోళన చెందారు.   అయితే  తాజాగా ఆమె తను తల్లి కాబోతున్న విషయాన్ని ప్రకటించడం గమనార్హం. 

25 ఏండ్ల ఒసాకా.. ట్విటర్ వేదికగా స్పందిస్తూ..‘మళ్లీ టెన్నిస్ కోర్టులోకి  అడుుగుపెట్టాలని ఆతృతగా ఎదురుచూస్తున్నా. కానీ నా జీవితానికి సంబంధించిన చిన్న అప్డేట్ మీతో పంచుకుంటున్నా..’అని  స్కానింగ్ రిపోర్ట్ ను ట్విటర్ లో పంచుకుంది. 

అంతేగాక.. ‘నేను భవిష్యత్ లో ఆడాల్సిన ఆట చాలా మిగిలే  ఉంది.  ముఖ్యంగా నాకు పుట్టబోయే బిడ్డ నా ఆట చూసి    నా మ్యాచ్ లు చూడాలి. చూసి తన స్నేహితులతో ఆమె నా తల్లి  అని చెప్పుకోవాలి...’అని  నోట్ లో రాసుకొచ్చింది.  తాను గర్భవతినని ట్విటర్ లో ప్రకటించగానే  ఆమెకు తన సహచర ఆటగాళ్లతో పాటు  ఫ్యాన్స్ నుంచి కూడా విషెస్ అందుతున్నాయి. 

 

పెళ్లి కాకుండానే... 

ప్రెగ్నెన్సీ ప్రకటించిన ఒసాకాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆమె  ప్రముఖ అమెరికన్ ర్యాపర్, సింగర్ అయిన   కోరేడ్ తో  రిలేషన్‌షిప్ లో ఉంది. 2019 నుంచి  ఈ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారు. ఒసాకా కంటే కోరేడ్  ఓ ఏడాది చిన్నవాడు.  ఈ ఇద్దరూ ఏడాది పాటు సీక్రెట్ గా డేటింగ్ చేశారు.  2020  చివర్లో వీరి  రిలేషన్షిప్ బయటపడింది. అప్పట్నుంచి ఈ ఇద్దరూ బహిరంగంగానే  కార్యక్రమాలకు హాజరుకావడం, ఫంక్షన్లలో క్లోజ్ గా మూవ్ అవడం చేస్తున్నారు.  పెళ్లి గురించి ఇద్దరిలో ఏ ఒక్కరూ అధికారికంగా ప్రకటన చేయలేదు.  అయినా  ఒసాకా మాత్రం తాజాగా  ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేయడం గమనార్హం.  

Follow Us:
Download App:
  • android
  • ios