Asianet News TeluguAsianet News Telugu

సిరిసిల్లలో నేత కార్మికులకు నిరంతరం పని: రాజన్న సిరిసిల్లలో కేటీఆర్


శాంతి భద్రతల అదుపులో జిల్లా పోలీసులు సమర్ధవంతంగా పనిచేస్తున్నారని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. గురువారం నాడు ఉదయం రాజన్న సిరిసిల్లలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
 

Telangana government committed to welfare of Weavers: KTR
Author
Karimnagar, First Published Jun 2, 2022, 10:57 AM IST

సిరిసిల్ల:  శాంతి భద్రతల అదుపులో జిల్లా పోలీసులు సమర్ధవంతంగా పనిచేస్తున్నారని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. బుధవారం నాడు రాజన్న సిరిసిల్లలో Telangana Formation  వేడుకల్లో మంత్రి KTR పాల్గొన్నారు. తొలుత National Flag  ఆవిష్కరించారు కేటీఆర్. ఆ తర్వాత పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు. చేనేత కార్మికులకు నిరంతరం పని కల్పించేందుకు గాను బతుకమ్మ చీరల తయారీకి సిరిసిల్ల నేత కార్మికులకే ఆర్డర్ ఇచ్చినట్టుగా మంత్రి చెప్పారు.

also read:గాంధీ భవన్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు: స్టెప్పులేసిన వీహెచ్, జగ్గారెడ్డి

 రంజాన్, క్రిస్ మస్ పండుగలకు కూడా ప్రభుత్వం ఇచ్చే చీరలకు కూడా Rajanna Siricilla  నేత కార్మికులే తయారు చేస్తున్నారన్నారు. సిరిసిల్లలోని సుమారు 15 వేలకు పైగా నేత కార్మికులు ప్రతి నెల రూ. 16 వేల వేతనాలను పొందుతున్నారని మంత్రి గుర్తు చేశారు. 

నేత కార్మికులకు ప్రతి రోజూ పని కల్పించే ఉద్దేశ్యంతోనే Sarees తయారీని సిరిసిల్ల కార్మికులకు అప్పగించామన్నారు. మరమగ్గాల పరిశ్రమ అభివృద్దికి తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని కూడా కేటీఆర్ వివరించారు. సిరిసిల్ల మండలంలో రూ. 174 కోట్లతో అపెరల్ పార్క్ పనులు కూడా ప్రారంభించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.

రూ.4.50 కోట్లతో గోకుల్ దాస్ పరిశ్రమ ఏర్పాటైందన్నారు. ఈ పరిశ్రమ ద్వారా రూ. 950 మందికి ఉపాధి దక్కుతుందని మంత్రి తెలిపారు. అపెరల్ పార్క్ పూర్తైతే ఈ ప్రాంతంలోని 8 వేల మంది మహిళలకు ఉపాధి దక్కనుందని మంత్రి కేటీఆర్ వివరించారు. అపెరల్, గార్మెంట్ రంగంలో మహిళలకు ఉపాధి కల్పించేందుకు గాను శిక్షణ కూడా ఇస్తున్నామని మంత్రి చెప్పారు. పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న యువతీ యువకులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. 

నేర నియంత్రణ కోసం పోలీసు యంత్రాంగం సంపూర్ణంగా కృషి చేస్తుందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నకిలీ నక్సలైట్లను అరెస్ట్ చేసినట్టుగా చెప్పారు. తరచుగా కార్డెన్ సెర్చ్ లు నిర్వహిస్తున్నామన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios