Asianet News TeluguAsianet News Telugu

Lok Sabha Elections 2024 : తెలంగాణపై కాంగ్రెస్ వరాలు... ప్రత్యేక మేనిఫెస్టోలోని హామీలివే...

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేవలం తెలంగాణ కోసమే  ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించింది కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణకు ఏం చేస్తారో ఈ మేనిఫెస్టోలో తెలిపింది కాంగ్రెస్. 

Telangana Congress Special Manifesto Released AKP
Author
First Published May 3, 2024, 3:54 PM IST

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా బిజెపి... కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా సాగుతోంది... కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా కనిపిస్తోంది. ఇతర పార్టీలతో కలిసి కాంగ్రెస్ ఇండి కూటమిని ఏర్పాటుచేసినా ఎన్డిఏకు గట్టి పోటీ ఇచ్చేలా కనిపించడంలేదని రాజకీయ విశ్లేషకులు, పలు సర్వేలు చెబుతున్నాయి. దీంతో తమకు బలముండి... అధికారంలో వున్న రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు గెలుచుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.  అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో తెలంగాణపై కాంగ్రెస్ కు ఆశలు మరింత పెరిగాయి. దీంతో  తెలంగాణలో అత్యధిక లోక్ సభ స్థానాలు గెలుచుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించినా తెలంగాణకు మరో మేనిఫెస్టోను రూపొందించారు. ఇలా తెలంగాణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షి విడుదలచేసారు. 

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో జరిగిన ఈ మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి టిపిసిసి అధ్యక్షులు, సీఎం రేవంత్ రెడ్డి హాజరుకావాల్సి వుంది. కానీ రాహుల్ గాంధీ రాయ్ బరేలి లోక్ సభకు పోటీ చేస్తుండటం... ఇవాళ నామినేషన్ వేస్తుండటంతో ఆ కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళ్ళారు రేవంత్. దీంతో దీపాదాస్ మున్షీతో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్, సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్  తదితరులు తెలంగాణకు ప్రత్యేక హామీల మేనిఫెస్టోను విడుదల చేసారు..

ప్రత్యేకంగా తెలంగాణ కోసం కాంగ్రెస్ రూపొందించిన మేనిఫెస్టోలోని కీలకాంశాలు : 

1. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ లో ఐటిఐఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆండ్ ఇన్వెస్ట్ మెంట్ రీజయన్) ప్రాజెక్ట్ ను మంజూరుచేసింది. కానీ బిజెపి దాన్ని రద్దుచేసింది. ఇప్పుడు మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఐటీఆర్ ప్రాజెక్ట్ ను  ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 

2. హైదరాబాద్ లో సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం. 

3. తెలంగాణలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా. 

4. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా

5. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుండి ఆంధ్ర ప్రదేశ్ లో కలిసిన ఐదు గ్రామాలు ఏటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నెగూడెం, పిచుకలపాడు తిరిగి తెలంగాణలో విలీనం 

6. హైదరాబాద్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆప్ మేనేజ్ మెంట్ (ఐఐఎం) ఏర్పాటు 

7. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు  కర్మాగారం

 8. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్కనుండి రాపిడ్ రైల్వే వ్యవస్థ

9. రాష్ట్రంలో మైనింగ్ యూనివర్సిటీ 

10.  హైదరాబాద్ లో నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు 

11. తెలంగాణలో మరిన్ని విమానాశ్రయాల ఏర్పాటు 

12. రామగుండం-మణుగూరు మధ్య నూతన రైల్వే లైన్ 

13. సైనిక పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు పెంపు... జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ ఆండ్ రీసెర్చ్ ఏర్పాటు 

14. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ

15. హైదరాబాద్-బెంగళూరు మధ్య ఐటి, ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్- నాగ్ పూర్ మధ్య ఇండస్ట్రియల్ కారిడార్.  అలాగే హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నల్గొండ మధ్య ఇండస్ట్రియల్ కారిడార్స్, సింగరేణి పారిశ్రామిక కారిడార్ 

16. తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు 

17. అంతర్జాతీయ ప్రమాణాలతో సాంస్కృతిక, వినోద కేంద్రం 


 

Follow Us:
Download App:
  • android
  • ios