Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ బంద్.... ప్రైవేట్ బస్సు డ్రైవర్ ని చితకబాదిన కార్మికులు

ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్ ని ఆర్టీసీ కార్మికులు చితకబాదారు. ఈ సంఘటన నాగోల్ లో చోటుచేసుకుంది. నాగోల్ బండ్లగూడ డిపో వద్ద బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఆందోళనకారులు అడ్డుకోవడంతో ఉద్రికత​ పరిస్థితులు తలెత్తాయి. డీజిల్ ట్యాంకర్‌ టైర్లకు మేకులు కొట్టేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.

RTC workers attack on private bus driver in nagole
Author
Hyderabad, First Published Oct 19, 2019, 11:29 AM IST

తెలంగాణ రాష్ట్రంలో బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులు 15 రోజులుగా చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈరోజు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్త బంద్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా... ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు బంద్‌లో పాల్గొంటున్నాయి. బంద్‌లో భాగంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. బంద్‌ను విజయవంతం చేసి ప్రభుత్వం దిగొచ్చేలా చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. మరోవైపు బంద్‌ ప్రభావం లేకుండా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

ఈ నేపథ్యంలో... ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్ ని ఆర్టీసీ కార్మికులు చితకబాదారు. ఈ సంఘటన నాగోల్ లో చోటుచేసుకుంది. నాగోల్ బండ్లగూడ డిపో వద్ద బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఆందోళనకారులు అడ్డుకోవడంతో ఉద్రికత​ పరిస్థితులు తలెత్తాయి. డీజిల్ ట్యాంకర్‌ టైర్లకు మేకులు కొట్టేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.

 ఓ ప్రైవేటు డ్రైవర్‌ను కూడా ఆర్టీసీ కార్మికులు చితకబాదారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా  బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంజీబీఎస్‌ దగ్గరా కూడా పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బస్సులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉండగా.. బంద్ కి మద్దతుగా నిలిచిన నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే సీపీఐ నారాయణ, పలువురు టీడీపీ నేతలను అరెస్టు చేయగా... తాజాగా నారాయణగూడ వద్ద సిపిఐ నేత చాడ వెంకట రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేసారు. నేటి ఉదయం జూబిలీ బస్సు స్టాండ్ ముట్టడికి యత్నించిన టీజెఎస్ అధ్యక్షుడు కోదండరాం ను పోలీసులు అరెస్ట్ చేసారు. వీరిని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఆర్టీసీ కార్మికులతో వెంటనే ప్రభుత్వం చర్చలు జరపాలని ఈ సందర్భంగా కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులను పోలీసులు అరెస్ట్‌ చేశారు రాష్ట్రవ్యాప్తంగా పొద్దటి నుండి అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఎక్కడికక్కడ ధర్నాలకు దిగిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి సమీప పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. 

కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం,బీజేపీ ఇలా అన్ని పార్టీల కార్యకర్తలను నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ డిపోల ముందు ధర్నాలకు దిగిన కార్మికులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. కొన్నిచోట్ల ఈ అరెస్టులు తోపులాటలకు, ఘర్షణలకు కూడా దారి తీస్తున్నాయి. 

సమ్మెకు విద్యార్థి సంఘాలు కూడా మద్దతు ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు ఉస్మానియా యూనివర్సిటీ వద్ద కూడా భారీగా మోహరించారు. దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా 30వేల మంది పోలీసులు విధి నిర్వహణలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. 

క్యాబ్ లు, ఆటోలు కూడా ఈ బంద్ కి మద్దతు ఇవ్వడం గమనార్హం. ఇన్ని రోజులు బస్సులు లేకపోయినా క్యాబులు, ఆటోలతో ప్రజలు తమ ప్రయాణాలను కొనసాగించారు.నేడు అవి కూడా బంద్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో బంద్ ప్రశాంతంగా సాగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios