Asianet News TeluguAsianet News Telugu

మోదీ ఒడిలో కూర్చుని ఆడుకుంటున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా..?  

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు చెందిన ఓ బుడ్డోడిని చేతుల్లోకి తీసుకుని సరదాగా ఆడించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకూ ఆ చిన్నారి ఎవరంటే....

Prime Minister Narendra Modi Meet small Child at Lakshmipuram Village Warangal AKP
Author
First Published May 9, 2024, 8:16 AM IST

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హడావిడి నెలకొంది. మొత్తం ఏడు దశల్లో మొత్తం లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎక్కడ ఎన్నికలుంటే అక్కడికి ప్రధాని మోదీ వాలిపోతున్నారు...బిజెపితో పాటు ఎన్డిఏ కూటమి మిత్రపక్షాల తరపున ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇలా తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ముమ్మర ప్రచారం నిర్వహించారు ప్రధాని. నిన్నంతా తెలంగాణతో పాటు  ఆంధ్ర ప్రదేశ్ లో సుడిగాలి పర్యటన చేసారు. ఈ క్రమంలోనే ప్రధానిని ఓ బుడ్డోడు పాలబుగ్గల చిరునవ్వుతో ఆకట్టుకున్నాడు... దీంతో వాడిని స్వయంగా ఎత్తుకుని ముద్దాడారు ప్రధాని. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  
 
ఎవరీ చిన్నారి..? 

తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు నాలుగో దశలో  ఎన్నికలు జరుగుతున్నాయి. మే 13న పోలింగ్ పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ నిన్న(బుధవారం) కరీంనగర్, వరంగల్ లోక్ సభ పరిధిలో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్నారు. బిజెపి క్యాడర్ లో జోష్ నింపుతూ... కమలంపువ్వు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరుతూ ప్రధాని ప్రచారం సాగింది.

మొదట వేములవాడలో జరిగిన బిజెపి ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని రోడ్డుమార్గంలోనే వరంగల్ కు బయలుదేరారు. ఈ క్రమంలోనే మోదీని చూసేందుకు ప్రజలు రోడ్డుకు ఇరువైపులా చేరారు. ఇలా లక్ష్మీపురంలో ఓ తల్లి తన చిన్నారి బిడ్డను తీసుకుని ప్రధానిని చూసేందుకు రోడ్డుపైకి వచ్చింది. ఎండను సైతం లెక్కచేయకుండా బిడ్డను తీసుకువచ్చిన ఆమెకు జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం మిగిలింది. 

బిడ్డను ఎత్తుకుని తనను చూసేందుకు వచ్చిన ఆ తల్లిని చూసిన ప్రధాని మోదీ వెంటనే కాన్వాయ్ ఆపారు. తన కారుదిగి ఆ తల్లి వద్దకు వెళ్లి ఆ బుడ్డోడిని చేతుల్లోకి తీసుకున్నారు. చిన్నారిని ఎత్తుకుని కొద్దిసేపు ప్రేమగా ఆడించారు. ఆ బుడ్డోడు కూడా ప్రధానిని చూస్తూ పాలబుగ్గల నవ్వులు చిందించాడు. ఇలా మోదీని దూరంనుండి చూస్తే చాలని ఆయన అభిమానించేవారు, కలిస్తే చాలని బిజెపి నాయకులు కోరుకుంటారు.... అలాంటిది ఈ పిల్లాడికి మాత్రం అతడి ఒడిలో కూర్చుని ఆటాడుకునే అరుదైన అవకాశం దక్కింది. అతడు చాలా అదృష్టవంతుడని బిజెపి శ్రేణులు అంటున్నాయి. 

అయితే చిన్నారిని లాలిస్తున్న ఫోటోను స్వయంగా ప్రధాని మోదీ సోషల్ మీడియా ద్వారా ప్రజలతో పంచుకున్నారు. ''వరంగల్ లో ప్రచార ర్యాలీకు వెళ్తుండగా లక్ష్మీపురం గ్రామంలో నా యువ మిత్రుడిని కలిశాను'' అంటూ బుడ్డోడితో కలిసున్న ఫోటోను జతచేస్తూ ప్రధాని ట్వీట్ చేసారు. 

తెలంగాణ బిజెపి కూడా ప్రధాని మోదీ చిన్నారిని ఎత్తుకుని ఆడిస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ''తాతయ్యా... నాలాంటి చిన్నారుల భవిష్యత్తు భద్రతకు మీరు గ్యారంటీ... మీ విజయం దేశ ప్రజల గ్యారంటీ'' అంటూ ఆ చిన్నారి ప్రధానితో చెబుతున్నట్లుగా ఆసక్తికర కామెంట్స్ తో ట్వీట్ చేసింది తెలంగాణ బిజెపి. 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios