Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ పై మళ్లీ మోత్కుపల్లి సంచలన కామెంట్స్

  • రేవంత్ తోటి పార్టీకి  లాభం లేదు
  • రేవంత్ నాకు మధ్య వ్యక్తిగత వైరం లేదు
  • టిఆర్ఎస్ తో పొత్తు ఉండే అవకాశం ఉంది.
  • నేను టిడిపిలో హీరో లాంటివాడిని
  • కేసిఆర్ నాకు మంచి ఫ్రెండ్
motkupalli launches second attack on TTDP Rebel Reventh

టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మళ్లీ రేవంత్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో మోత్కుపల్లి చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి చేసిన కామెంట్స్...

రేవంత్ రెడ్డి వల్ల పార్టీ కి నష్టమే తప్ప లాభం లేదు. రేవంత్ నిన్న గాక మొన్న టిడిపి లోకి వచ్చాడు. కాంగ్రెస్ పెద్దలను కలిసిన రేవంత్ పై చర్యలు తీసుకోవాలంటే అది మా అధిష్టానం మాత్రమే తీసుకోవాలి. రేవంత్ ని సస్పెండ్ చేసే అధికారం నాకు లేదు. మా అధిష్టానం ఆ పని చూసుకుంటది.

రేవంత్ ను సస్పెండ్ చేసే అధికారం తన చేతిలో ఉంటే ఎప్పుడో సస్పెండ్ చేసేవాణ్ని. పార్టీలో గింత వివాదం జరిగిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి టిడిఎల్పీలో పెట్టే మీటింగ్ కు రావుల చంద్రశేఖర్ రెడ్డి వెళ్తారని నేను అనుకోను. నా పవరేంటో పార్టీలో ఎవరిని అడిగినా చెబుతారు. ఇవ్వాళ కూడా నామినేషన్ వేస్తే ఆలేరులో ఈజీగా గెలుస్తా.

రేవంత్ తో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వం లేదు. ఆయన వేసే స్టెప్ సరైన దారిలో లేదు కాబట్టే మేము అడ్డుకుంటున్నాము. విమర్శిస్తున్నాము.

రానున్న ఎన్నికల్లో టీఆరెస్ తో టిడిపి పొత్తు పెట్టుకునే అవకాశం వందకు వంద శఆతం ఉంది. కేంద్రంలో బీజేపీ తో ఇటు టీఆరెస్, అటు టిడిపి పొత్తు ఉంటుందని అనుకుంటున్నాను. కాబట్టి యాంటీ కాంగ్రెస్ లో భాగంగా పొత్తు ఉండే అవకాశం ఉంటుంది. కేసీఆర్ కి నాకు వ్యక్తిగత  శత్రుత్వం  ఏమి లేదు.

టిడిపి పార్టీ రావటం వల్లే జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలు వచ్చాయి. కేసీఆర్ నేను బెస్ట్ ఫ్రెండ్స్ 1986 నుంచి కేసీఆర్ కి నాకు పరిచయం. నేను టిడిపి పార్టీకి హీరో లాంటివాడిని. నా చివరి రక్తపు బొట్టు ఉండే వరకు నేను టిడిపి లోనే ఉంటా.

ఇలా అనేక అంశాలపై మోత్కుపల్లి మీడియాకు వెల్లడించారు.

 

మరిన్ని కొత్త వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వెంకయ్య నాయుడి ఆరోగ్యం బాగుంది..

https://goo.gl/A9SzB8

Follow Us:
Download App:
  • android
  • ios