Asianet News TeluguAsianet News Telugu

మంచిర్యాలలో వాటర్ ట్యాంక్ పైనే ఇద్దరు : హెలికాప్టర్ రప్పిస్తున్న అధికారులు

పశువులను తీసుకొచ్చేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు గోదావరి నది వరద నీటిలో చిక్కుకున్నారు. ఈ వరద ప్రవాహం నుండి తప్పించుకొనేందుకు గాను వాటర్ ట్యాంక్ పై ఎక్కి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రక్షించాలని కోరుతున్నారు. 

Mancherial Officials tries To  bring Helicopter for rescue Two persons
Author
Karimnagar, First Published Jul 14, 2022, 1:57 PM IST

మంచిర్యాల: పశువులను తీసుకొచ్చేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు వరదలో చిక్కుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. రాత్రి నుండి Water Tank పై కూర్చొని సమాయం చేయాలని అర్ధిస్తున్నారు. ఈ విషయం తెలిసిన అధికారులు వారిని కాపాడేందుకు Helicopterను రప్పిస్తున్నారు.

also readకడెం ప్రాజెక్టుకు తప్పిన ముప్పు: తగ్గిన ఇన్ ఫ్లో, ఊపిరి పీల్చుకున్న అధికారులు

Mancherialకు చెందిన Gattaiah, Saraiah లు పశువులను ఇంటికి తీసుకొచ్చేందుకు బుధవారం నాడు సాయంత్రం వెళ్లారు.అయితే పశువులు  తీసుకెళ్లే మార్గంలో గోదావరివరద నీరు చుట్టు ముట్టింది. దీంతో సమీపంలోని వాటర్ ట్యంక్ పై ఎక్కి తలదాచుకున్నారు. నిన్న సాయంత్రం నుండి బాధితులు ట్యాంక్ పై ఉన్నారు. తమను కాపాడాలని బాధితులు అధికారులక ఫోన్  లో సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం తెలుసుకున్న అధికారులు వారిని రక్షించేందుకు  హెలికాప్టర్లను రప్పించాలని భావిస్తున్నారు.ఈ మేరకు రక్షణ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. హెలికాప్టర్ల ద్వారా వీరిద్దరిని వాటర్ ట్యాంక్ నుండి రక్షించాలని భావిస్తున్నారు.
పశువులను తీసుకొచ్చేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు గోదావరి నది వరద నీటిలో చిక్కుకున్నారు. ఈ వరద ప్రవాహం నుండి తప్పించుకొనేందుకు గాను వాటర్ ట్యాంక్ పై ఎక్కి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రక్షించాలని కోరుతున్నారు. 

మంచిర్యాల పట్టణంలో వరద నీరు ముంచెత్తింది. మరో వైపు గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తుండడంతో వరద ముంపు పెరిగే అవకాశం ఉందని  స్థానికులు ఆందోళన చెందుతున్నారు.మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ,, రాం నగర్,  పద్మశాలీ కాలనీ సహా పలు కాలనీలు వరద నీటిలోనే ఉన్నాయి. రాళ్లవాగు,తోళ్లవాగుల నుండి వరద నీరు మంచిర్యాల పట్టణంలోని  పలు కాలనీలను ముంచెత్తాయి. వీటి కారణంగానే మరింత వరద పట్టణంలోకి వచ్చే అవకాశం ఉందని ఆ:దోళన చెందుతున్నారు.ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద 54 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 1.3 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్దుంది. ఈ ప్రాజెక్టుకు చెందిన 54 గేట్లు ఎత్తి 1.30 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  వరద నీరు ముంచెత్తడంతో  ఇప్పటికే మంచిర్యాల, నిజామాబాద్ మధ్య రాకపోకలునిలిచిపోయాయి.  మరోవైపు మంచిర్యాల నిజామాబాద్ మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి.  

మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపం సమీపంలోని ఇంటిలో ఓ వ్యక్తి నిన్న చిక్కుకున్నారు. తనను కాపాడాలని ఆయన ఆర్తనాదాలు చేశారు.ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. 

ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తింది. కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో ఈ ప్రాజెక్టు దిగువన ఉన్న 25 గ్రామాల ప్రజలను  సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయతే ఇవాళ్టికి ఈ ప్రాజెక్టుకు వరద తగ్గింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కడెం ప్రాజెక్టు సేఫ్ అంటూ ప్రకటించారు. 

కడెం ప్రాజెక్టుకు 5 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో గా వచ్చింది.ప్రాజెక్టు డిశ్చార్జ్ కెపాసిటీ మూడు లక్షలు మాత్రమ. అయితే దీంతో ఇరగేషన్ అధికారులు  దిగువ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. దీంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.  కడెం ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో ఈ నీటిని డిశ్చార్జ్ చేసే కెపాసిటీ లేకపోవడంతో మూడు చోట్ల ప్రాజెక్టుకు గండ్లు పడినట్టుగా అధికారులు గుర్తించారు.

Follow Us:
Download App:
  • android
  • ios