Asianet News TeluguAsianet News Telugu

నేను కేటీఆర్ పీఏను.. మంత్రి ఇంటికి కొన్ని వస్తువులు కావాలంటూ...

రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ వ్యక్తిగత పీఏనంటూ ఓ వ్యక్తి పలువురికి ఫోన్లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. దీంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది.వారికి అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు సదురు వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారు. 
 

man -Crime-in-the-name-of-KTR
Author
Hyderabad, First Published Oct 20, 2019, 3:59 PM IST

ఇనాళ్ళు  నకిలి  పోలీసులను, నకిలి అధికారులను మాత్రమే చూశాం. ఇప్పడు ఓ వ్యక్తి  ఏకంగా  తను కేటీఆర్ పీఏను అంటూ పలువురు మోసం చేస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. తను తెలంగాణ  రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ వ్యక్తిగత సహాయకుడినంటూ  పలువురికి ఫోన్లు చేస్తూ ఓ వ్యక్తి మోసాలకు  పాల్పడుతున్నాడు. దీంతో ఓ వ్యక్తి పోలీసులకు  పిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  

వారికి అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు సదురు వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారు.   నిందుతుడు  తరుచుగా  పలువురు తెరాస నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు ఫోన్లు చేసి మోసం పాల్పడుతున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. తను  కేటీఆర్ పీఏనని సార్  ఇంటికి కొన్ని వస్తువులు కావాలని .. వాటిని నేరుగా ఇవ్వకుండా ఓ చోట ఉంచితే తాను కారు తీసుకుని వచ్చి వాటిని తీసుకుని వెళతానని పలువురికి నిందుతుడు ఫోన్ చేసేవాడు. అంతేకాకుండా కేటీఆర్ పీఏ వస్తున్నారంటూ షాపింగ్ కాంప్లెక్స్ యజమానులకు చెప్పండి అక్కడికి వెళ్లి మేం షాపింగ్‌ చేస్తాం’ అంటూ పలువురికి సూచించేవాడు.


ఈవిధంగానే బంజారాహిల్స్‌లో ఉంటున్న ఓ నేతకు  నిందుతుడు మూడు రోజుల క్రితం ఫోన్‌ చేశాడు. ముందుగా కేటీఆర్ పీఏనంటూ సరిచయం చేసుకున్న అతను 
తర్వాత ఓ పనిచేయాలంటూ కొరాడు. దీంతో ఆ నేతకు అనుమానం వచ్చి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. సదురు వ్యక్తి గురించి అరా తీసిన అదికారులు అతను కేటీఆర్‌ పీఏనే కాదని తేల్చారు. దీంతో ఆ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios