Asianet News TeluguAsianet News Telugu

ఇలా చేస్తే వాట్సాప్‌లో అమ్మాయిలతో చాట్ కట్.. త్వరలో కొత్త అప్‌డేట్..

 వాట్సాప్ పాలసీలను ఉల్లంఘిస్తే చాటింగ్ చేయకుండా తాత్కాలికంగా బ్లాక్ చేయగల కొత్త ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తెస్తోంది.
 

WhatsApp : If you violate this policy, you will not be able to chat on WhatsApp.. New update soon-sak
Author
First Published May 2, 2024, 4:44 PM IST

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు వాట్సాప్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. క్విక్ కమ్యూనికేషన్ కోసం చాలా మంది ఈ యాప్‌ని వాడుతున్నారు. యూజర్ల సౌకర్యార్థం వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు పలు కొత్త అప్ డేట్ లను లాంచ్ చేస్తుంది. అందుకు సంబంధించి వాట్సాప్ త్వరలో ఓ కొత్త ఫీచర్‌ను విడుదల చేయనుంది. దీని ప్రకారం ఈ కొత్త కంట్రోల్ ఫీచర్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో కనిపించింది. భవిష్యత్ అప్‌డేట్‌లో ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తుందని, వాట్సాప్ విధానాలను ఉల్లంఘించే యూజర్లు వారితో చాట్ చేయకుండా తాత్కాలికంగా బ్లాక్ చేయబడతారని తెలిపింది. 

దీని అర్థం  WhatsApp విధానాలను ఉల్లంఘించే వారు తాత్కాలికంగా నిషేధించబడతారు. అప్పుడు యూజర్లు  కొంత సమయం వరకు కొత్త  వారితో  చాట్‌ చేయలేరు. అయితే, ఇప్పటికే ఉన్న చాట్స్  అండ్  గ్రూప్‌లలో మెసేజెస్ పొందడం, వాటికి రిప్లయ్ కూడా చేయవచ్చు. అలాగే అవసరమైన కమ్యూనికేషన్‌లు ఇబ్బంది లేకుండా  ఉండేలా చూస్తుంది.

WhatsApp సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించే మోసాలు, బల్క్ మెసేజింగ్  ఇతర అక్టీవిటీస్  సహా వివిధ రకాల దుర్వినియోగాలను గుర్తించడానికి ఆటోమాటిక్  టూల్స్  ఉపయోగిస్తుంది. ముఖ్యంగా, ఈ టూల్స్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ కారణంగా మెసేజ్  కంటెంట్ నుండి స్వతంత్రంగా పనిచేస్తాయి.

 పర్మనెంట్  బ్యాన్ కాకుండా టెంపరరీ నిషేధం సెలెక్ట్ చేసుకోవడం ద్వారా WhatsApp వినియోగదారులు వారి డేటాకు పూర్తిగా యాక్సెస్  కోల్పోకుండా వారి అడ్జస్ట్  చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. అకౌంట్ కంట్రోల్ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధిలో ఉంది. దీనిని  యాప్   ఫ్యూచర్  అప్ డేట్స్ లో తీసుకొచ్చే అవాశం ఉందని భావిస్తున్నారు.

అంతే కాకుండా, వాట్సాప్ ఇటీవల కొత్త అప్‌డేట్‌ లాంచ్ చేసింది. దీని ప్రకారం, వాట్సాప్ లో మొత్తం కలర్  థీమ్  మార్చింది. కంపెనీ బ్రాండ్ కలర్ కు సరిపోయేలా ఆకుపచ్చ రంగు మార్చింది.  చాలా మంది కొత్త లుక్‌ను ప్రశంసించగా, కొందరు సోషల్ మీడియాలో కూడా ఈ మార్పును విమర్శించారు. కొన్ని సింబల్స్  ఇంకా బటన్‌ల ఆకారం అలాగే  రంగుతో సహా విభిన్నంగా కనిపిస్తాయి. యాప్‌లోని కొంత  భాగం  గతం కంటే ఎక్కువ ఖాళీగా ఉన్నాయి. మీ స్క్రీన్ పైభాగంలో ఉండే ట్యాబ్‌లు ఇప్పుడు కింద ఉన్నాయని గుర్తుంచుకోండి.

Follow Us:
Download App:
  • android
  • ios