Asianet News TeluguAsianet News Telugu

మార్కెట్లోకి శాంసంగ్‌ హై-ఎండ్‌ ఫ్లిప్‌ఫోన్.. ధర రూ. లక్ష పైమాటే!!

యాపిల్ ‘ఐఫోన్ల’తో పోటీ పడుతూ దక్షిణ కొరియా మేజర్ శ్యామ్‌సంగ్ వినూత్న రీతిలో స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించింది. తాజాగా హై ఎండ్ ఫ్లిప్ ఫోన్ ‘డబ్ల్యూ2019’ అనే పేరుతో ఆవిష్కరించిన ఈ ఫోన్ ధర రూ. లక్ష పై మాటే.

Samsung launches high-end flip phone 'W2019' with dual display
Author
Bezinghem, First Published Nov 13, 2018, 10:45 AM IST

బీజింగ్‌: ఆపిల్, షియామీ, వన్ ప్లస్ వంటి ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలతో పోటీ పడుతోంది దక్షిణ కొరియా మొబైల్ మేజర్ శాంసంగ్. అంతేకాదు యాపిల్ ‘ఐఫోన్ల’కు ధీటుగా కొత్త మోడల్ ఫోన్లను ఉత్పత్తి చేస్తోంది. తాజాగా సరికొత్త స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. ‘డబ్ల్యూ 2019’ పేరుతో హైఎండ్‌ ఫ్లిప్‌ మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. 

ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యుయల్‌ సూపర్‌ డిస్‌ప్లే, డ్యుయల్‌ రియర్‌ కెమెరా, స్నాప్‌ డ్రాగన్ 845 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్‌ తదితర ప్రధాన ఫీచర్లు ఉన్నాయి. పుల్‌ బాడీ 3డీ గ్లాస్ మెటల్ డిజైన్‌తో రూపొందించిన ఈ డివైస్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేసింది. రోజ్‌ గోల్డ్, ప్లాటినం కలర్ వేరియెంట్లలో శాంసంగ్ డబ్ల్యూ 2019 స్మార్ట్‌ఫోన్ మోడల్ స్మార్ట్ ఫోన్ ధర సుమారు రూ.1,05,000గా ఉంది.  

‘శాంసంగ్ డబ్ల్యూ2019’లో 4.2 అంగుళాల సూపర్ అమోలెడ్ డ్యుయల్ అంటే.. ఇంటర్నల్‌, ఎక్స్‌టర్నల్‌ డిస్‌ప్లేలు ఉంటాయి. ఇక 
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ కూడా ఏర్పాటు చేశారు. 
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
6జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్ సామర్థ్యంతోపాటు 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ప్లస్ మైక్రో ఎస్డీ కార్డు కూడా అందుబాటులో ఉంటుంది.

12+12 ఎంపీ  డ్యుయల్ బ్యాక్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. అదనంగా 3070 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ ఓరియో వర్షన్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్ కానున్నది. డ్యుయల్ సిమ్ ఫోన్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్/ ఎ-జీపీఎస్, ఎన్ఎఫ్ సీ సపోర్ట్, సీ టైప్ యూఎస్బీ పోర్టు అందుబాటులో ఉంటుంది. మిగతా స్మార్ట్ ఫోన్ల మాదిరిగా బిక్స్ బై మద్దతు కలిగి ఉంటుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios