Asianet News TeluguAsianet News Telugu

రెడ్‌మి 10 పవర్ vs పోకో ఎం4ప్రొ : రూ. 15,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది..?

రెడ్‌మి 10 పవర్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌, 8జి‌బి ర్యామ్ తో వస్తుంది. ఈ రెడ్‌మి ఫోన్ పోకో ఎం4 ప్రొతో పోటీపడుతుంది. 

Redmi 10 Power vs Poco M4 Pro: Which is the best smartphone under Rs 15,000?
Author
Hyderabad, First Published Apr 22, 2022, 2:39 PM IST

రెడ్‌మి తాజాగా రెడ్‌మి 10 పవర్‌ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేసింది. అయితే ఈ కొత్త ఫోన్ రెడ్‌మి 9 పవర్‌కి అప్‌గ్రేడ్ వెర్షన్, దీనిని గత ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ చేశారు. రెడ్‌మి 10 పవర్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌, 8జి‌బి ర్యామ్ తో వస్తుంది. ఈ రెడ్‌మి ఫోన్ పోకో ఎం4 ప్రొతో పోటీపడుతుంది. పోకో ఎం4 ప్రొ అండ్ పోకో ఎం4 ప్రొ 10 పవర్ రెండింటి ప్రారంభ ధర రూ. 14,999. పోకో ఎం4 ప్రొలో 4జి కనెక్టివిటీ ఉంది అలాగే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43-అంగుళాల AMOLED డిస్‌ప్లే లభిస్తుంది. పోకో ఎం4 ప్రొలో MediaTek Helio G96 ప్రాసెసర్ ఇచ్చారు. రూ. 15,000 పరిధిలో పోకో ఎం4 ప్రొ అండ్ రెడ్‌మి 10 పవర్ మధ్య ఏ ఫోన్ బెస్ట్ అంటే..?

స్పెసిఫికేషన్‌లు
పోకో ఎం4 ప్రొలో ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 13 ఉంది. 1,000 నిట్స్ బ్రైట్‌నెస్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే ఇచ్చారు. ఫోన్‌లో MediaTek Helio G96 ప్రాసెసర్ 8జి‌బి వరకు LPDDR4x ర్యామ్, 256జి‌బి వరకు స్టోరేజ్ ఉంది. ఫోన్‌లో లిక్విడ్ కూల్ టెక్నాలజీ 1.0  కూడా ఉంది. ఫోన్‌లో డైనమిక్ ర్యామ్  లభిస్తుంది, దీని సహాయంతో ర్యామ్‌ను 11 జిబికి పెంచవచ్చు.

రెడ్‌మి 10 పవర్ లో Android 11 ఆధారిత MIUI 13ఉంది. ఇది 6.7-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను 400 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌తో ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ డిస్ ప్లేతో వస్తుంది. గ్రాఫిక్స్ కోసం Adreno 610 GPUతో స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, 3జి‌బి వరకు వర్చువల్ ర్యామ్‌తో 8జి‌బి LPDDR4x ర్యామ్ అంటే మొత్తం 11జి‌బి ర్యామ్ పొందుతుంది.

 కెమెరా
ఈ Poco ఫోన్‌లో మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, దీని ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్‌లు. రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ యాంగిల్. అంతేకాకుండా దీనిలో 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీ కోసం ఈ ఫోన్ 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను పొందుతుంది.
కెమెరా గురించి మాట్లాడితే ఈ రెడ్‌మి ఫోన్‌లో రెండు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, ఇందులో ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్‌లు ఎపర్చరు f/1.8 ఉంది. రెండవ లెన్స్ f / 2.4 ఎపర్చరుతో 2 మెగాపిక్సెల్స్. ఇందులో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

  బ్యాటరీ
కనెక్టివిటీ కోసం, Poco M4 Proలో 4G LTE, Wi-Fi 802.11 a/b/g/n, బ్లూటూత్ v5, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, IR బ్లాస్టర్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. ఫోన్‌లో ఫేస్ ఐడీ కూడా ఉంటుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 5000mAh బ్యాటరీ ఉంది. 61 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ అవుతుందని చెబుతున్నారు.

కనెక్టివిటీ కోసం, Redmi 10 పవర్‌లో 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v5, GPS/ A-GPS, USB టైప్-C, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, పవర్ బటన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. Redmi 10 పవర్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 6000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది, అయితే బాక్స్‌లో 10W ఛార్జర్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.

 ధర
పోకో ఎం4ప్రొ 6 జి‌బి ర్యామ్ 64జి‌బి స్టోరేజ్ ధర రూ. 14,999, 6జి‌బి ర్యామ్ 128జి‌బి స్టోరేజ్ ధర రూ. 16,499. 8జి‌బి ర్యామ్ 128జి‌బి ధర రూ. 17,999. 

8 జీబీ ర్యామ్‌తో కూడిన రెడ్‌మి 10 పవర్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. పవర్ బ్లాక్ అండ్ స్పోర్టీ ఆరెంజ్ కలర్‌లో ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఫోన్ సేల్ తేదీ గురించి కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios