Asianet News TeluguAsianet News Telugu

నేడే రియల్ మీ జి‌టి 2 ఫస్ట్ సేల్.. ఇండియాలో లాంచ్ ఆఫర్, ధర ఎంతంటే..?

ఈ స్మార్ట్ ఫోన్ కి 120Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది ఇంకా పేపర్ టెక్ మాస్టర్ డిజైన్‌ లభిస్తుంది. పేపర్ డిజైన్ ఇటీవల Realme GT 2 ప్రోలో కనిపించింది.

Realme GT 2 first sale in India today, know from price to launch offers
Author
Hyderabad, First Published Apr 28, 2022, 1:26 PM IST

రియల్ మీ (Realme)ఇండియా కొత్త స్మార్ట్‌ఫోన్  రియల్ మీ జి‌టి2 (Realme GT 2)ని గత వారం ఇండియాలో లాంచ్ చేసింది. ఇంతకుముందు రియల్ మీ జి‌టి2ని ఈ సంవత్సరం ఫిబ్రవరిలో MWC 2022లో ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ ఫోన్ కి 120Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది ఇంకా పేపర్ టెక్ మాస్టర్ డిజైన్‌ లభిస్తుంది. పేపర్ డిజైన్ ఇటీవల Realme GT 2 ప్రోలో కనిపించింది. ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఇచ్చారు. రియల్ మీ జి‌టి2 షియోమీ 11టి ప్రొ, iQoo 9ఎస్‌ఈ, వివో వి23 ప్రొ 5జి, ఒప్పో రెనో 7 ప్రొ 5జి' వంటి స్మార్ట్‌ఫోన్‌లతో పోటీపడుతుంది. ఈరోజు అంటే ఏప్రిల్ 28న Realme GT 2 ఫస్ట్ సేల్ జరగనుంది. అయితే ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం...

రియల్ మీ జి‌టి2 ధర
రియల్ మీ జి‌టి2 8జి‌బి ర్యామ్‌తో 128జి‌బి స్టోరేజ్ ధర రూ. 34,999. 12 జీబీ ర్యామ్‌తో కూడిన 256 జీబీ స్టోరేజ్ ధర రూ.38,999గా ఉంది. ఈ ఫోన్‌ను పేపర్ గ్రీన్, పేపర్ వైట్, స్టీల్ బ్లాక్ కలర్‌లలో ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు. Realme GT 2ని HDFC బ్యాంక్ కార్డ్‌లపై రూ. 5,000 క్యాష్‌బ్యాక్ కూడా ఉంది.

 స్పెసిఫికేషన్‌లు
రియల్ మీ జి‌టి 2 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.62-అంగుళాల పూర్తి HD+ E4 AMOLED డిస్‌ప్లే ఉంది. డిస్ ప్లే బ్రైట్ నెస్ 1,300 నిట్స్. ఫోన్‌లో Snapdragon 8 Gen 1 ప్రాసెసర్  అంతేకాకుండా హీట్ డిస్సిపేషన్ టెక్నాలజీ, స్టెయిన్‌లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ కూడా ఇందులో ఇచ్చారు. దీని ద్వారా ఫోన్‌ను 3 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లబరుస్తుంది.

 కెమెరా
Realme GT 2లో మూడు బ్యాక్ కెమెరాలు ఉంటాయి. దీని ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్స్ తో సోనీ IMX776 సెన్సార్. రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్ మాక్రో. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ
కనెక్టివిటీ కోసం ఫోన్ Wi-Fi 6, 5జి, బ్లూటూత్ 5.2, NFCకి సపోర్ట్ చేస్తుంది. 65W ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 5000mAh బ్యాటరీని ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios