Asianet News TeluguAsianet News Telugu

మీరు సంతోషంగా లేకపోతే ఆఫీస్ రాకండి ఈ లీవ్ తీసుకోండి.. కంపెనీ కొత్త నిర్ణయం..

వర్క్‌ప్లేసెస్  2021 సర్వే ప్రకారం, 65 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిలో అలసిపోయినట్లు, అసంతృప్తిగా ఉన్నారు. యు డోంగ్లాయ్ చైనా ఉన్నతాధికారులు ఎక్కువ పని గంటలను సమర్థించడాన్ని ఖండించారు.  
 

Isnt it a joy to work? Let's take unhappy leave now; This company with a new decision-sak
Author
First Published Apr 16, 2024, 6:00 PM IST

మీరు ఉదయం లేవగానే ఆఫీసుకు వెళ్లడానికి ఉత్సాహంగా లేరా ? లేక మరేదైనా కారణం వల్ల  అసంతృప్తికి గురవుతున్నారా.. అందుకే ఆఫీస్ కు వెళ్లలేమని భావించి సెలవు తీసుకోవడం మామూలే.. కానీ చైనాలోని ఓ సంస్థ మాత్రం 'అన్ హ్యాపీ లీవ్' ఇస్తూ  సెన్సేషన్  సృష్టించింది. చైనీస్ రిటైల్ చైన్ పాంగ్ డాంగ్ లై గ్రూప్ యజమాని యు డాంగ్లాయ్, ప్రతి ఒక్కరికి unhappy సమయాలు ఉంటాయని, కాబట్టి మీరు సంతోషంగా లేకుంటే పనికి రావద్దని, ఉద్యోగులు సంవత్సరానికి అదనంగా 10 రోజుల సెలవును కొరవచ్చని ప్రకటించారు.
 
కంపెనీ లేబర్ పాలసీ ప్రకారం ఉద్యోగులు రోజుకు ఏడు గంటలు మాత్రమే పని చేస్తే సరిపోతుంది. అంతేకాక వీకెండ్ లీవ్స్, 30 నుండి 40 రోజుల అన్యువల్  లీవ్స్  అండ్  లూనార్ న్యూ ఇయర్ సందర్భంగా ఐదు రోజుల సెలవులు ఉంటాయి. మా ఉద్యోగులు ఆరోగ్యవంతమైన ఇంకా  ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నట్లు యు డాంగ్లాయ్ పేర్కొన్నారు.

చైనాలోని వర్క్‌ప్లేసెస్  2021 సర్వే ప్రకారం, 65 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిలో అలసిపోయినట్లు, అసంతృప్తిగా ఉన్నారు. యు డోంగ్లాయ్ చైనా ఉన్నతాధికారులు ఎక్కువ పని గంటలను సమర్థించడాన్ని ఖండించారు.  

ఏ ఉద్యోగైన unhappy లీవ్  కోరితే అతనిని సెలవు తీసుకోకుండా కంపెనీ నిరాకరించదని యు డాంగ్లాయ్ స్పష్టం చేశారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమని ఉన్నతాధికారులను హెచ్చరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios