Asianet News TeluguAsianet News Telugu

మొబైల్ యూజర్లకు రూ.239 ఫ్రీ రీఛార్జ్..? అయితే పిఐబి ఎం చెబుతుందంటే..

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా (పిఐబి) ఈ వార్తలను ఫేక్ న్యూస్ అని పేర్కొంది. ఈ ఉచిత రీఛార్జ్ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం నిర్వహించడం లేదని కూడా స్పష్టం చేసింది. 

Is Modi Govt offering Rs 239 free recharge plan to all people? Viral news What is the truth-sak
Author
First Published May 15, 2023, 2:53 PM IST

సోషల్ మీడియాలో రోజురోజుకి  రకరకాల ఫేక్ న్యూస్ లు వేగంగా వ్యాపిస్తున్నాయి. అయితే తాజాగా ఇప్పుడు ఓ వార్త వైరల్ అవుతోంది. భారతీయ వినియోగదారులందరికీ 28 రోజుల పాటు రూ. 239 ఉచిత రీచార్జ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్నట్లు ఈ మెసేజ్ లో  పేర్కొన్నారు. 2024 ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం ఈ ఉచిత రీఛార్జ్‌ను అందజేస్తుందని, దింతో ఎక్కువ మంది బిజెపికి ఓటు వేస్తారని ఒక నివేదికలో పేర్కొన్నారు. ఈ మెసేజ్‌లో ఇచ్చిన లింక్ ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చని ఇంకా ఆఫర్ పొందడానికి వారి పేరును జోడించాలని పేర్కొంది.

అయితే, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా (పిఐబి) ఈ వార్తలను ఫేక్ న్యూస్ అని పేర్కొంది. ఈ ఉచిత రీఛార్జ్ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం నిర్వహించడం లేదని కూడా స్పష్టం చేసింది. ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ వార్తలను ప్రచారం చేస్తున్నారని కూడా సమాచారం.


ఇలాంటి అనుమానాస్పద వార్తలేమైనా అందితే, దాని మనం చెక్ చేయవచ్చు. ఇంకా ఇది నిజమైన వార్తా లేక ఫేక్ న్యూస్ అని తెలుసుకోవచ్చు.  దీని కోసం, https://factcheck.pib.gov.inకి మెసేజ్ పంపాలి. అలాగే మీరు ఫ్యాక్ట్ చెక్  కోసం +918799711259కి WhatsApp మెసేజ్ పంపవచ్చు. మీరు మీ మెసేజ్ pibfactcheck@gmail.comకి కూడా పంపవచ్చు. ఫ్యాక్ట్ చెక్  సమాచారాన్ని https://pib.gov.inలో కూడా చెక్  చేయవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios