Asianet News TeluguAsianet News Telugu

మీకు గూగుల్ అకౌంట్ ఉందా.. ఒక్కసారి కూడా ఉపయోగించలేదా అయితే వెంటనే ఇలా చేయండి.. లేదంటే..?

గూగుల్ వర్క్‌స్పేస్ (జిమెయిల్, డాక్స్, డ్రైవ్, మీట్, క్యాలెండర్), యూట్యూబ్ ఇంకా గూగుల్ ఫోటోలలోని ఇన్‌యాక్టివ్ అకౌంట్ కంటెంట్‌ను తొలగిస్తామని కంపెనీ తెలిపింది .
 

Google to delete all personal accounts inactive for 2 years-sak
Author
First Published May 17, 2023, 4:12 PM IST

న్యూఢిల్లీ: కనీసం 2 సంవత్సరాలుగా ఉపయోగించని లేదా సైన్ ఇన్ చేయని పర్సనల్  అకౌంట్స్  ఇంకా వాటి కంటెంట్‌ను తొలగిస్తామని గూగుల్ మంగళవారం తెలిపింది.

గూగుల్ వర్క్‌స్పేస్ (జిమెయిల్, డాక్స్, డ్రైవ్, మీట్, క్యాలెండర్), యూట్యూబ్ ఇంకా గూగుల్ ఫోటోలలోని ఇన్‌యాక్టివ్ అకౌంట్ కంటెంట్‌ను తొలగిస్తామని కంపెనీ తెలిపింది .

ఈ పాలసీ మంగళవారం నుండి అమల్లోకి వచ్చినప్పటికీ ఇన్‌యాక్టివ్ అకౌంట్ ఉన్న వినియోగదారులపై  తక్షణమే ప్రభావం చూపదు,  కంపెనీ అకౌంట్స్ తొలగింపు  డిసెంబర్ 2023 మొదలవుతుంది.

"ఈ పాలసీ వ్యక్తిగత Google ఖాతాలకు మాత్రమే వర్తిస్తుంది ఇంకా స్కూల్స్ లేదా వ్యాపారాల వంటి సంస్థల ఖాతాలను ప్రభావితం చేయదు" అని Google   ప్రోడక్ట్ మేనేజ్మెంట్ VP రూత్ క్రిచెలీ ఒక ప్రకటనలో తెలిపారు.

“ఒక ఖాతాను ఎక్కువ కాలం పాటు ఉపయోగించకుంటే, అది కంప్రమైజ్డ్  అవకాశం ఉంది. ఎందుకంటే, మరచిపోయిన లేదా  ఆన్ అటెండెడ్ అకౌంట్స్ తరచుగా పాత లేదా మళ్లీ ఉపయోగించిన పాస్‌వర్డ్‌లపై ఆధారపడతాయి, అవి కంప్రమైజ్డ్   ఉండవచ్చు, టు ఫ్యాక్టర్ అతేంటికేషన్  సెటప్ చేయలేదు, తక్కువ సెక్యూరిటీ చెక్స్ పొందుతుంది, ”అని గూగుల్ వివరించింది.

టు ఫ్యాక్టర్ అతేంటికేషన్   సెటప్‌ను ఉండే  అక్టీవ్ ఖాతాల కంటే వదిలివేసిన ఖాతాలు కనీసం 10 రెట్లు తక్కువగా ఉన్నాయని Google ఇంటర్నల్  అనాలిసిస్ చూపిస్తుంది.

"ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి మేము Google అకౌంట్స్  కోసం మా ఇన్‌యాక్టివిటీ పాలసీని మా ఉత్పత్తుల్లో 2 సంవత్సరాలకు అప్‌డేట్ చేస్తున్నాము" అని కంపెనీ తెలిపింది.

అకౌంట్స్  తొలగించే ముందు, Google అకౌంట్ ఇమెయిల్ అడ్రస్, రికవరీ  ఇమెయిల్ (ఒకవేళ అందించబడి ఉంటే) రెండింటికీ తొలగింపుకు దారితీసే నెలల్లో మల్టి  నోటిఫికేషన్‌లను పంపుతుంది.

గతంలో ప్రకటించినట్లుగా, యూజర్లు యాక్టివ్‌గా పరిగణించబడటానికి ప్రతి 2 సంవత్సరాలకు ప్రత్యేకంగా Google ఫోటోలకు సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios