Asianet News TeluguAsianet News Telugu

Google Pixel 6a: గూగుల్ నుంచి పిక్సల్ 6ఏ.. ధర ఎంతంటే..?

ఎట్టకేలకు నిరీక్షణ తర్వాత గూగుల్ పిక్సెల్ 6ఏ (Google Pixel 6a) లాంచ్ అయింది. సంస్థ వార్షిక డెవలపర్స్ కాన్ఫరెన్స్ Google I/O సందర్భంగా గూగుల్ ఈ మొబైల్‌ విడుదల చేసింది. గూగుల్ సొంత టెన్సర్ ప్రాసెసర్‌ (Tensor Processor ) ఈ మొబైల్‌లో ఉంటుంది.
 

Google 6a announced, the new affordable Pixel series phone
Author
Hyderabad, First Published May 12, 2022, 1:07 PM IST

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సొంత బ్రాండ్ పిక్సల్ నుంచి 6a సిరీస్ వచ్చేసింది. I/O 2022 ఈవెంట్‌లో భాగంగా Google Pixel 6a స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ గత ఏడాదిలో లాంచ్ అయిన Pixel 5a స్మార్ట్ ఫోన్‌కు లేటెస్ట్ అడ్వాన్స్ మోడల్ ఫోన్. గూగుల్ తమ స్వంత టెన్సర్ చిప్‌సెట్‌తో తీసుకొచ్చింది. ప్రీమియం పిక్సెల్ 6 సిరీస్‌లో పాత మోడల్ పిక్సెల్ 6 మాదిరిగానే డిజైన్‌తో వచ్చింది.

Pixel 6a ధర ఎంతంటే..?

Pixel 6a (6GB RAM+128GB) ఇంటర్నల్ స్టోరేజీతో ఒకే వేరియంట్‌లో వస్తుంది. ఇక మోడల్ పిక్సెల్ 5a లాంచ్ ధరకు సమానమైన ధర 449 డాలర్ల వద్ద వస్తుంది. అంటే.. మన భారత కరెన్సీలో దాదాపు రూ. 35,000 వరకు ఉంటుంది. ఇక ఈ ఫోన్ బ్లాక్, మింట్ గ్రీన్ గ్రే/సిల్వర్ అనే 3 కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. అమెరికాలో Pixel 6a జూలై 21 నుంచి నేరుగా Google స్టోర్ లేదా బ్రిక్ అండ్ మోర్టార్ స్టోర్‌ల నుంచి జూలై 28 నుంచి అందుబాటులో ఉంటుంది. Pixel 6a ఈ ఏడాది చివరిలో భారత్‌కు వస్తుందని Google ధృవీకరించింది. ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది కచ్చితమైన తేదీ నిర్ధారించలేదు.

Pixel 6a స్పెసిఫికేషన్స్

Pixel 6a పూర్తి స్క్రీన్ 6.1-అంగుళాల డిస్‌ప్లేతో సెంటర్డ్ హోల్ పంచ్ కటౌట్, స్టాండర్డ్ 60hz రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఫోన్ పైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా అందిస్తుంది. హార్డ్‌వేర్ విషయానికి వస్తే.. పిక్సెల్ డివైజ్ Google సొంత టెన్సర్ చిప్‌సెట్‌తో వస్తుంది. 6GB వరకు LPDDR5 RAM, 128GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజీతో ప్రీమియం Pixel 6 మాదిరిగా పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 4306mAh బ్యాటరీతో సపోర్ట్, స్పీడ్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. ఎక్స్‌ట్రీమ్ బ్యాటరీ సేవర్‌తో ఫోన్ 24 గంటల బ్యాటరీ లైఫ్‌ను 72 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

స్టీరియో స్పీకర్లు, రెండు మైక్రోఫోన్‌లు, డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ నాయిస్ సప్రెషన్ ఉన్నాయి. Google కనీసం 5 ఏళ్లవరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లు, యాంటీ ఫిషింగ్, యాంటీ మాల్వేర్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ మెసేజస్ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్, ఆండ్రాయిడ్ బ్యాకప్ ఎన్‌క్రిప్షన్ కూడా అందిస్తుంది. బ్యాక్ ప్యానెల్‌లో, ఫోన్ 12-MP ప్రైమరీ సెన్సార్, 12-MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. Pixel 6a 30 fps వద్ద 4K వీడియోలను షూట్ చేయొచ్చు. 4K టైమ్‌లాప్స్, పంచ్ హోల్ డిస్‌ప్లేతో ఒకే 8-MP సెన్సార్‌తో ఆకర్షణీయంగా ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios