Asianet News TeluguAsianet News Telugu

సైనా నెహ్వాల్‌కి కరోనా పాజిటివ్... థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి అవుట్...

బ్యాంకాక్‌లో నిర్వహించిన మూడో టెస్టులో సైనాకి పాజిటివ్...

థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి తప్పుకున్న భారత స్టార్ ప్లేయర్...

బ్యాడ్మింటన్ మెన్స్ ప్లేయర్ ప్రణయ్‌కి కూడా కరోనా నిర్థారణ...

Saina nehwal tested positve for Corona Virus, ruled out of Thailand Open CRA
Author
India, First Published Jan 12, 2021, 11:46 AM IST

భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌ కరోనాకు గురైంది. థాయ్‌లాండ్ ఓపెన్ కోసం బ్యాంకాక్ చేరిన ఆమెకు సోమవారం నిర్వహించిన మూడో టెస్టులో పాజిటివ్ వచ్చింది. దీంతో మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి ఆఖరి నిమిషంలో తప్పుకుంది సైనా నెహ్వాల్. 

షెడ్యూల్ ప్రకారం థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 1000 మొదటి రౌండ్‌లో మలేషియాకు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ కిసోనా సెల్వడురేతో సైనా నెహ్వాల్ తలబడాల్సి ఉంది. సైనా తప్పుకోవడంతో కిసోనా రెండో రౌండ్‌కి అర్హత సాధించింది.

సైనా నెహ్వాల్‌తో పాటు భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రణయ్ కూడా కరోనా బారినపడ్డాడు. 10 నెలల బ్రేక్ తర్వాత బ్యాడ్మింటన్ ఆడాలని ప్రయత్నించిన సైనాకు కరోనా కారణంగా ఆ అవకాశం దక్కలేదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios