Asianet News TeluguAsianet News Telugu

Commonwealth Games 2022: విజయోస్తు..! కామన్వెల్త్ కు వెళ్లబోయే అథ్లెట్లలో స్ఫూర్తి నింపిన మోడీ

PM Narendra Modi: ఈనెల 26 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా జరుగబోయే  కామన్ వెల్త్ క్రీడలకు వెళ్లబోయే ఆటగాళ్లతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. వారికి విజయం సిద్ధించాలని ఆకాంక్షించారు. 

PM Narendra Modi Interacts With Commonwealth Games Bound Athletes, Wishes Them Good Luck
Author
India, First Published Jul 20, 2022, 1:39 PM IST

జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లాండ్ లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరుగబోయే కామన్వెల్త్ క్రీడలలో పాల్గొనబోయే క్రీడలలో పాల్గొనే క్రీడాకారులతో భారత ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం మాట్లాడారు. అథ్లెట్లతో వర్చువల్ గా ఇంటరాక్ట్ అయిన  మోడీ.. వారిలో స్ఫూర్తిని నింపారు.  ఈ ఈవెంట్ లో అంచనాలను మరిచి  తమ అత్యుత్తమ ఆటతీరుపై దృష్టి పెట్టాలని మోడీ వారికి సూచించారు. 

అథ్లెట్ల  పోరాటం,  పట్టుదల, వారి సంకల్పాన్ని హైలైట్ చేసిన  మోడీ.. కామన్వెల్త్ క్రీడలలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘ఒత్తిడి లేకుండా మీ బలాన్ని నమ్మి ఆడండి.  ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగండి..’అని క్రీడాకారులలో స్ఫూర్తిని నింపారు. 

ఈ సందర్భంగా మోడీ.. పలువురు క్రీడాకారులతో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు.  ఈ కార్యక్రమంలో  3000 మీటర్ల స్టీఫుల్ ఛేజర్ అవినాష్ సేబుల్, వెయిట్ లిఫ్టర్ అచింత షెయులీ,  మహిళల హాకీ జట్టు క్రీడాకారిణి  సలీమా టెటె, సైక్లిస్ట్ డేవిడ్ బెక్ హమ్, పారా షాట్ పుటర్ షర్మిలతో మోడీ ముచ్చటించారు. 

 

సేబుల్ మాట్లాడుతూ.. ‘నేను 2012లో ఇండియన్ ఆర్మీలో చేరాను. నాలుగేండ్లపాటు  సాధారణ డ్యూటీ చేశాను.  అత్యంత కఠినమైన ఆర్మీ శిక్షణలో రాటుదేలాను. ఆ తర్వాత అథ్లెటిక్స్ ను కెరీర్ గా  ఎంచుకున్నాను..’ అని తెలిపాడు. తాను పాల్గొనబోయే ఈవెంట్  లో అడ్డంకులు చాలా ఉంటాయని.. ఆర్మీ  శిక్షణ ఎలా ఉంటుందో  అదేవిధంగా తాము కూడా అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుందని చెప్పాడు. 

కాగా మోడీ తో ఇంటరాక్షన్ లో ఒలింపిక్ డబుల్ మెడల్ విజేత పీవీ సింధు, మహిళల హాకీ గోల్ కీపర్ సవితా పునియా, రియో  ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ,  బాక్సర్లు, షట్లర్లతో పాటు కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios