Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని మోదీకి మద్ధతుగా సైనా నెహ్వాల్ ట్వీట్... కౌంటర్ ఇచ్చిన హీరో సిద్ధార్థ్...

పంజాబ్‌లో ప్రధాని మోదీపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్టు బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ట్వీట్... వ్యంగ్యంగా స్పందించిన హీరో సిద్ధార్థ్...

Actor Siddharth comment on Badminton star Saina Nehwal tweet goes viral about PM Modi
Author
India, First Published Jan 10, 2022, 3:37 PM IST

నటుడిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో, వివాదాస్పద వ్యాఖ్యలతో అంతకంటే ఎక్కువగానే వార్తల్లో నిలిచాడు హీరో సిద్ధార్థ్.. ‘బొమ్మరిల్లు’ వంటి డబుల్ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మళ్లీ హిట్టు కొట్టలేకపోయిన సిద్ధార్థ్... ‘తెలువారికి టేస్ట్ లేదంటూ’ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారం రేపాయి. తాజాగా అల్లుఅర్జున్ హీరోగా నటించిన ‘పుష్ఫ’ సినిమా కలెక్షన్లపై ఇన్‌డైరెక్ట్‌గా ట్వీట్ చేసి, బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన సిద్ధార్థ్... ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నాడు....

తాజాగా జనవరి 5న పంజాబ్ పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీని కొందరు నిరసనవాదులు అడ్డుకున్న విషయం తెలిసిందే. రోడ్డుకు అడ్డంగా భారీ కేడ్లతో నిరసన వ్యక్తం చేయడంతో  ప్రధానమంత్రి భద్రత దృష్ట్యా, ప్రధాని కాన్వాయ్‌ని పర్యటనను రద్దు చేసుకుని వెనుదిరగాల్సి వచ్చింది... ఈ సంఘటనపై క్రీడా ప్రపంచం కూడా స్పందించింది...

‘ప్రధానిపైనే దాడి జరిగితే, ఆ దేశంలో భద్రత ఉందని ఎలా చెప్పగలం. భారత ప్రధాని మోదీపై జరిగిన ఈ దుర్మార్గమైన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా...’ అంటూ ట్వీట్ చేసింది భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్...

షటిల్ స్టార్ సైనా నెహ్వాల్ ట్వీట్‌కి హీరో సిద్ధార్థ్ స్పందించాడు. ‘అతిచిన్న కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్... దేవుడా... భారతదేశాన్ని రక్షించేవాళ్లు కూడా ఉన్నారు... షేమ్ ఆన్ యూ రిహానా... ’ అంటూ వెటకారంగా ట్వీట్ చేసిన సిద్ధార్థ్... ‘కాక్ అండ్ బుల్... ఇది నా రిఫరెన్స్...  ఈ పుస్తకం చదవకుండా మాట్లాడితే తప్పే అవుతుంది... మిమ్మల్ని అవమానించాలని ఏదీ చెప్పలేదు, ఏదీ ప్రేరేపించాలని చెప్పింది కాదు... పీరియడ్.’ అంటూ మరో ట్వీట్ వేశాడు...

హీరో సిద్ధార్థ్ వేసిన ట్వీట్లకు నెటిజన్ల నుంచి తీవ్రమైన స్పందన వస్తోంది. తెలుగు, తమిళ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి కూడా సిద్ధార్థ్ ట్వీట్‌పై స్పందించింది. ‘ఇది నిజంగా క్రూరత్వం సిద్ధార్థ్... ఎంతో మంది మహిళలు దేనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారో, నువ్వు దాన్నే సపోర్ట్ చేశావ్...’ అంటూ కామెంట్ చేసింది చిన్మయి...

సోషల్ మీడియాలో స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేయడానికే దేశంలో సగం మంది మహిళలు భయపడుతుంటే, సైనా నెహ్వాల్ వేసిన ట్వీట్‌కి ఇలాంటి సమాధానం ఇవ్వడం సరికాదనే ఉద్దేశంలో ఇలా కామెంట్ చేసింది చిన్మయి శ్రీపాద...

అంతేకాకుండా హీరో సిద్ధార్థ్ ట్వీట్‌లో ‘పీరియడ్’ అనే పదాన్ని వాడడాన్ని కూడా స్త్రీవాదులు, మహిళా సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. సిద్ధార్థ్ ఈ పదాన్ని పురుషాహంకారంతో మహిళలను అవమానించేందుకే వాడాడని ఆరోపిస్తున్నాడు...

ఎన్టీఆర్ ‘బాద్‌షా’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన సిద్ధార్థ్, దాదాపు 8 ఏళ్ల తర్వాత గత ఏడాది నేరుగా తెలుగు సినిమాలో నటించాడు. హీరో శర్వానంద్‌తో కలిసి అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహా సముద్రం’ సినిమాలో కీలక పాత్ర పోషించాడు సిద్ధార్థ్. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది..
 

Follow Us:
Download App:
  • android
  • ios