Asianet News TeluguAsianet News Telugu

గ్లాన్జా జీ ఎంటీతో మున్ముందుకు టయోటా

మారుతి సుజుకి బాలెనో ప్లాట్ ఫామ్ వేదికగా టయోటా నుంచి మరో మోడల్ కారు గ్లాన్జా జీ ఎంటీ విపణిలోకి అడుగు పెట్టింది. ఇంతకుముందు గ్లాన్జా జీ, వీ వేరియంట్లలో విపణిలో అడుగు పెట్టడంతో టాటా మోటార్స్, హోండా కార్లను దాటేసి ముందుకెళ్లిపోయింది టయోటా.

Toyota Glanza G MT launched at Rs 6.98 lakh
Author
Hyderabad, First Published Oct 7, 2019, 1:06 PM IST

న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టయోటా కిర్లోస్కర్ విపణిలోకి సరికొత్త మోడల్ కారు ‘గ్లాన్జా జీ ఎంటీ’ను విడుదల చేసింది. దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి బాలెనో ప్లాట్ ఫామ్ వేదికగా దీన్ని తయారుచేస్తున్నది. దీని ధర రూ.6.98 లక్షలుగా టయోటా నిర్ణయించింది.

ఇందులో స్మార్ట్ హైబ్రీడ్ సిస్టమ్ అమర్చలేదు. ఫలితంగా కారు ధర రూ.24 వేలు తగ్గింది. గ్లాన్జా జీ, వీ వేరియంట్లలో దీన్ని విక్రయిస్తున్నారు. బాలెనో కారుతో పోలిస్తే జీటా, ఆల్పాలతో సమానం. ఇప్పుడు జీ ఎంటీ, జీఎంటీ (స్మార్ట్ హైబ్రీడ్), వీ ఎంటీ, జీవీ సీవీటీ, వీ సీవీటీ మోడళ్లలో లభిస్తుంది.

జీ వేరియంట్ మోడల్ కారులో 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఇది బీఎస్ -6 ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఇంజిన్. 6000 ఆర్పీఎం వద్ద 82 బీహెచ్పీ శక్తిని విడుదల చేసింది. హైబ్రీడ్ వర్షన్ కంటే 6 బీహెచ్పీ శక్తి తక్కువగా ఉంటుంది. 4200 ఆర్పీఎం వద్ద 113 ఎన్ఎం టార్చ్ విడుదల చేస్తుంది.

టయోటా గ్లాన్జా జీ ఎంటీ మోడల్ కారు 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అమర్చారు. గ్లాన్జా సీవీటీ మోడల్ కారులో ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా అమర్చారు. మారుతి సుజుకి బాలెనో ప్లాట్ ఫామ్‌పై తయారుచేస్తున్న టయోటా గ్లాన్జా కారు విజయం సాధించడంతో టయోటా మోటార్స్ అమ్మకాలు మెరుగయ్యాయి. దీంతో కార్ల విక్రయాల్లో నాలుగో స్థానానికి చేరుకొంది. గ్లాన్జా మోడల్ విజయం సాధించడంతో టయోటా మోటార్స్ అమ్మకాలు మెరుగయ్యాయి.

టాటా మోటార్స్, హోండా కార్స్ సంస్థలను టయోటా పక్కకు నెట్టేసి టయోటా కిర్లోస్కర్ మోటార్స్ విజయం సాధించింది. నెలకు 2000 గ్లాన్జాలు విక్రయిస్తున్నట్లు టయోటా తెలిపింది. మరోపక్క ఇన్నోవా క్రిస్టా, ఫార్చూనర్ సంస్థలు నిలకడగా రాణిస్తుండటం కూడా టయోటా కిర్లోస్కర్ సంస్థకు కలిసి వచ్చింది. మార్కెట్ నెమ్మదించడం వంటి ప్రభావం టాటా మోటార్స్, హోండా కార్స్ విక్రయాలపై గణనీయంగా పడింది. టయోటా సుజుకి భాగస్వామ్యంలో వచ్చిన తొలి కారు గ్లాన్జా. హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో కారు టయోటాకు బలాన్నిచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios