Asianet News TeluguAsianet News Telugu

కర్నాటకలో బ్రాందీ షాపుల్ని ఇలా కాపాడారు...

స్టేట్  హైవే ల  పక్కన ఉండే బ్రాందీ షాపులను మూసేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.  అయితే, రాష్ట్రంలో చాలా చోట్ల స్టేట్  హైవే లను డినోటిఫై చేయాలని కర్నాటక కేంద్రాన్ని కోరింది.అంతే, దీనితో జాతీయ రహదారులు చాలా వూర్లలో మునిసిల్ రోడ్లయి పోయాయి.ఫలితంగా 3200 బ్రాందీషాపులు బతికిపోయాయి.

Karnataka reclassifies state highways as city roads to saves liquor shops

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇపుడా రాష్ట్రంలో మందుబాంధువుడయిపోయారు. ఆయన నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం  మందుబాబులంతా చిందులేస్తూ చీర్స్ కొట్ నిర్ణయం తీసుకుంది.

 కర్నాటక పబ్లిక్ వర్క్స డిపార్ట్ మెంటు మునిసిపాలిటిలో గుండా పోయే1,476.69 కిమీ స్టేట్  హైవేలను  పునర్ వర్గీకరించింది.  ఈ మేరకు జూన్ 13న నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రాన్ని అభ్యర్థించి స్టేట్  హైవే లను డినోటిఫై చేయించుకుంది ఈ రాష్ట్రం. దీనితో ఈ రోడ్ల మీద బ్రాంది షాపులకు సుప్రీంకోర్టు విధించిన బ్యాన్ వర్తించకుండా పోతుంది. దీనితో 3200 లిక్కర్ షాపులు మూత పడే ప్రమాదం నుంచి బయటపడ్డాయి.

జాతీయ లేద స్టేట్  హైవే లకు 500 లోపు ఉన్న లిక్కర్ షాపులన్నంటిని మూసేయాలని 2016 డిసెంబర్ లో సుప్రీంకోర్టు ఒక తీర్పులో ఆదేశించిన సంగతి తెలిసిందే. వూరి జనాభా 20 వేల లోపు ఉంటే ఈ దూరం 220 మీటర్లే.

దీనితో సుప్రీంకోర్టు తీర్పుతో రద్దు కావలసి లిక్కర్ షాపులలో 50 శాతానికి బతికి బయటపడుతున్నాయి.

ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల లిక్కర్ వ్యాపారానికి ఎంతో సహాయం చేసిందని, దాదాపు 50శాతం బ్రాంది షాపులకు ఇపుడు కోర్టు తీర్పు వర్తించదని  కర్నాటక వైన్ మర్చంట్స్ అసోషియేషన్ అధ్యక్షుడు జి.హన్నగిరి గౌడ చెప్పారు.

సుప్రీంకోర్టు తీర్పునుంచి వైన్ షాపులను కాపాడేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకోలేదు. హైవేల వెంబడి పట్టణాభివృద్ధి పనులు చేపట్టేందుకు రోడ్ల పునర్ వర్గీకరణ చేపట్టామని రాష్ట్ర పిడబ్ల్యూడి కార్యదర్శి ఎం. లక్ష్మినారాయణ చెప్పారు.

రాష్ట్రంలో మునిసిపాలిటీల గుండా పోయే 800 కిమీ పొడవయిన స్టేట్  హైవే లను డీనోటిఫై చేయాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అదింతవరకు పెండింగులో ఉండింది. ఇపుడు  ఈ అభివృద్ధి కార్యక్రమాల ఖర్చంతా స్థానిక సంస్థల మీద పడుతుందని కూడా ఆయన చెప్పారు.

ఈ కొత్త నిర్ణయంతో దాదాపు 100కి.మీ పొడవైన రోడ్లును బిబిఎంపి నిర్వహించాల్సి వస్తుంది.

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios