Asianet News TeluguAsianet News Telugu

బ్యాంక్ ఉద్యోగుల సమ్మెతో నిలిచిపోయిన భారీ లావాదేవీలు...రేపు కూడా

కేంద్ర ప్రభుత్వం కార్మిక సమస్యలను విస్మరిస్తోందంటూ అన్ని రకాల కార్మిక సంఘాలు కలిసి ఇవాళ, రేపు( 8,9వ తేదీ) భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో వివిధ రంగాలకు చెందిన  కార్మికులు స్వచ్చందంగా  విధులను బహిష్కరించి నిరసనలు తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకు వచ్చి కార్మికులకు అన్యాయం చేస్తూ యాజమాన్యాలకు కొమ్ము కాస్తోందని ఆరోపిస్తున్నారు. ఇలా కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్రానికి హెచ్చరికగా ఈ బంద్ చేపడుతున్నట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. 

Two-day bank strike begins today
Author
Hyderabad, First Published Jan 8, 2019, 12:46 PM IST

కేంద్ర ప్రభుత్వం కార్మిక సమస్యలను విస్మరిస్తోందంటూ అన్ని రకాల కార్మిక సంఘాలు కలిసి ఇవాళ, రేపు( 8,9వ తేదీ) భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో వివిధ రంగాలకు చెందిన  కార్మికులు స్వచ్చందంగా  విధులను బహిష్కరించి నిరసనలు తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకు వచ్చి కార్మికులకు అన్యాయం చేస్తూ యాజమాన్యాలకు కొమ్ము కాస్తోందని ఆరోపిస్తున్నారు. ఇలా కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్రానికి హెచ్చరికగా ఈ బంద్ చేపడుతున్నట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. 

కార్మిక సంఘాల సమ్మెకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రటించాయి. అంతేకాకుండా ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగుల సంఘాలు, రైతు సంఘాలు కూడా మద్దతు ప్రకటించి బంద్ లో పాల్గొన్నాయి. దీంతో ప్రభుత్వ సేవలతో పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయాయి. 

బారత్ బంద్ లో భాగంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ రంగ  బ్యాంకులు మూతపడ్డాయి. బ్యాంక్ ఉద్యోగులు తమ బ్యాంకుల ముందు టెంట్లు వేసుకుని నిరసన తెలియజేస్తున్నారు. రేపు కూడా( 9వ తేదీ) తాము సమ్మె చేపట్టనున్నట్లు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ప్రకటించాయి. ఈ సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా  భారీ ఎత్తున లావాదేవీలు నిలిచిపోనున్నాయి.ఈ రెండు రోజుల పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఖాతాదారుల లావాదేవీలు నిలిచిపోయి ఇబ్బందులు పడనున్నారు.  

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూడా బంద్ ప్రభావం కనిపిస్తోంది. వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు తమ  తమ  బ్యాంకుల ముందు నిరసన తెలియజేస్తున్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు కోటిలోని సిబిఐ ముందు ధర్నా చేపట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios