Asianet News TeluguAsianet News Telugu

60 ఏళ్ల మహిళపై ముగ్గురు యువకుల గ్యాంగ్ రేప్

వ్యాసర్పాడిలోని ఇంటి తలుపులు బద్దలు కొట్టి ముగ్గురు యువకులు లోనికి ప్రవేశించి కత్తితో బెదిరించి మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. 17 ఏళ్ల వయస్సు గల ఆ ముగ్గురు యువకులు ఆమె పక్కనే నివసిస్తుంటారు. 

Three teens rape 60-year-old woman
Author
Chennai, First Published Mar 6, 2019, 7:46 AM IST

చెన్నై: ముగ్గురు యువకులు 60 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది. ఈ కేసులో ఎంకెబీ నగర్ పోలీసులు ఓ యువకుడిని అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. 

వ్యాసర్పాడిలోని ఇంటి తలుపులు బద్దలు కొట్టి ముగ్గురు యువకులు లోనికి ప్రవేశించి కత్తితో బెదిరించి మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. 17 ఏళ్ల వయస్సు గల ఆ ముగ్గురు యువకులు ఆమె పక్కనే నివసిస్తుంటారు. 

బాధితురాలు ఇళ్లలో పనిచేస్తూ ఉంటుంది. నేరం చేసిన తర్వాత విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని మహిళను బెదిరించి వారు పారిపోయారు. ఆమెను స్టాన్లీ ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ఆ ప్రాంతంలోని కమ్యూనిటీ హాల్ కు రక్షణ లేదని, దాన్ని ఆ యువకులు గంజాయి సేవించడానికి వాడుతూ ఉండేవారని అంటన్నారు.  కమ్యూనిటీ హాల్ ను మూసేయాలని లేదా దానికి రక్షణ కల్పించాలని తాము పలుమార్లు పోలీసులను కోరామని, అయినా పట్టించుకోలేదని అంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios