Asianet News TeluguAsianet News Telugu

ఇండిగోలో 'ఎలిఫెంట్ విస్పరర్స్‌' కు ఘన స్వాగతం.. అస్కార్ విజేతలకు అభినందించిన ప్రయాణీకులు .. వీడియో వైరల్

భారతీయ డాక్యుమెంటరీ చిత్రం 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' .. 95వ ఆస్కార్ వేడుకల్లో సత్తా చాటింది. ఈ చిత్రంలో నటించిన బొమ్మన్, బెల్లి లు ఇటీవల ఊటీకీ విమానంలో ప్రయాణిస్తుండగా ఇండిగో ఫ్లైట్లో ప్యాసెంజర్స్ అందరూ వారికి ఘన స్వాగతం పలికి, ప్రశంసించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా  మారింది.

The Elephant Whisperers Couple central to the Oscar-winning documentary lauded by IndiGo captain and passengers KRJ
Author
First Published Mar 27, 2023, 1:01 AM IST

'ఎలిఫెంట్ విస్పరర్స్‌'కు ఘన స్వాగతం: 95వ ఆస్కార్ వేడుకల్లో భారతీయ డాక్యుమెంటరీ చిత్రం 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' సత్తా చాటింది. ఆస్కార్స్‌తో పాటు సరికొత్త రికార్డులను నెలకొల్పిన భారతీయ డాక్యుమెంటరీ చిత్రం 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' వార్తల్లో నిలిచింది. ఈ విజయం భారతీయలను అంతర్జాతీయ వేదికపై తల్లెత్తుకునేలా చేసింది.

ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత బొమ్మన్, బెల్లి ఎలిఫెంట్ రఘు పేర్లు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతున్నాయి. అయితే ఈ చిత్రంలో నటించిన బొమ్మన్, బెల్లి లకు అరుదైన గౌరవం దక్కింది.  వారు ఇటీవల ఊటీకీ విమానంలో ప్రయాణిస్తుండగా వారికి ఫ్లైట్ లోపల హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. ఇండిగో ఫ్లైట్లో ప్యాసెంజర్స్ అందరూ ప్రశంసించారు. వారికి ఫ్లైట్ లోపల హృదయపూర్వకంగా స్వాగతం పలికారు.

విమానంలో గౌరవం

ముంబై నుంచి ఊటీకి తిరిగి వస్తున్న విమానంలో  ఫ్లైట్ కెప్టెన్ ఇలా చెప్పడం వినవచ్చు. 'ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ అవార్డును గెలుచుకున్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ డాక్యుమెంటరీ యొక్క ప్రధాన బృందం మాతో పాటు ఫ్లైట్‌లో ఉంది, వీరి కోసం పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టాలి. ఆ ఇద్దరు కళాకారుల కోసం లేచి నిలబడమని విజ్ఞప్తి చేశాడు. ఈ ఇద్దరు నటులు బొమ్మన్, బెల్లీ చిత్రంలో నటిస్తున్నారు. నిజానికి వీరిద్దరూ నిజజీవితంలో ఏనుగు సంరక్షకులే.

 వీడియో వైరల్ 

ఈ ఇద్దరు నటులు ఉన్న విమానంలో ఐఏఎస్ సుప్రియా సాహు కూడా ఉన్నారు. ఈ వీడియోను సుప్రియా సాహు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను పంచుకుంటూ.. 'ఊటీ విమానంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ తారాగణంతో ప్రయాణించే అవకాశం వచ్చింది. ఇద్దరు ఆర్టిస్టుల గౌరవార్థం చప్పట్లు కొట్టిన సమయంలో మొత్తం  ఫ్లైట్ ప్రయాణీకులు తమ మొబైల్‌లను తీసి వారి చిత్రాలను తీయడం ప్రారంభించారు. ఈ ప్రయాణంలో ఇద్దరు కళాకారులు కూడా ఇప్పుడు తల్లిని కోల్పోయిన కొత్త ఏనుగును చూసుకుంటున్నారని చెప్పారు.  

తమిళనాడులోని ముదుమలై టైగర్ రిజర్వ్ లో రెండు అనాథ ఏనుగులను దత్తత తీసుకున్న ఓ కుటుంబం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. 39 నిమిషాల నిడివిగల ఈ షార్ట్ ఫిల్మ్ రెండు ఏనుగు పిల్లలైన రఘు, అము, వాటి సంరక్షకులు బొమ్మన్, బెల్లీ మధ్య విడదీయరాని బంధాన్ని చూపెట్టిన చిత్రం ఇది. 

Follow Us:
Download App:
  • android
  • ios