Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని మోదీ ఏసియా నెట్ న్యూస్ తో చెప్పినట్లే జరుగుతోందిగా ... రాయ్ బరేలిలో రాహుల్ పోటీ

వయనాడ్ లో పోలింగ్ ముగియగానే రాహుల్ గాంధీ మరోచోట పోటీకి సిద్దం అవుతారని ప్రధాని నరేంద్ర మోదీ ముందుగానే చెప్పారు... సరిగ్గా ఆయన చెప్పినట్లే రాహుల్ గాంధీ రాయ్ బరేలీ అభ్యర్థిగా ప్రకటించారు. 

Rahul Gandhi to contest Lok Sabha polls from Raebareli  AKP
Author
First Published May 3, 2024, 9:21 AM IST

హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏషియా నెట్ న్యూస్ తో చెప్పినట్లే జరుగుతోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వయనాడ్ లో పోలింగ్ ముగియగానే మరోచోట పోటీకి సిద్దం అవుతాడని... ఇది జరగడం పక్కా...రాసిపెట్టుకొండని మరీ చెప్పారు ప్రధాని. సరిగ్గా ఇప్పుడు అలాగే జరుగుతోంది... వయనాడ్ లో ఇప్పటికే పోలింగ్ ముగిసింది కాబట్టి ఇప్పుడు రాయ్ బరేలీలో పోటీకి రాహుల్ సిద్దమయ్యారు. గతంలో గాంధీ కుటుంబం ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ పోటీచేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. 

Rahul Gandhi to contest Lok Sabha polls from Raebareli  AKP

 ప్రధాని మోదీ ఏషియా నెట్ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే : 

మీరు దక్షిణ భారతదేశంపై దృష్టి పెట్టారు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీరు ప్రచారం చేసినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. తెలంగాణలో అదే జరిగింది. ఇప్పుడు 131 లోక్ సభ స్థానాల్లో 50కి పైగా నియోజ‌క‌వ‌ర్గాలు గెలుస్తామ‌న్న ఆశతో వున్నారు... అది సాధ్య‌మ‌ని భావిస్తున్నారా? అంటూ ఏషియా నెట్ న్యూస్ ప్రధాని మోదీని ప్రశ్నించింది. 

ఈ ప్రశ్నకు ప్రధాని మోదీ తనదైన స్టైల్లో సమాధానం చెప్పారు. రాహుల్ గాంధీ  వయనాడ్ లో పోటీపై స్పందించారు. కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ఉత్తరాది నుండి పారిపోయి దక్షిణాదిలో ఆశ్రయం పొందుతున్నాడని... ప్రస్తుతం అతడు వయనాడ్ లో పోటీ చేస్తున్నాడని అన్నారు. అయితే అతడి పరిస్థితి ఎలా వుందంటే ఏప్రిల్ 26న వయనాడ్ లో పోలింగ్ ముగియగానే మరో చోట పోటీ చేయాలని భావిస్తున్నాడు... మరో సీటుకోసం వెతుకుతున్నాడని అన్నారు. ఇది తాను రాజకీయాల కోసం చెప్పడం లేదు... తప్పకుండా జరుగుతుంది... కావాలంటే ఈ మాటలు రాసిపెట్టుకొండని అన్నారు. ప్రధాని మోదీ చెప్పినట్లుగానే ఇప్పుడు జరుగుతోంది. రాహుల్ గాంధీ రాయ్ బరేలి  నుండి పోటీకి సిద్దమయ్యారు.  

ఇక కాంగ్రెస్ కు చెందిన పెద్ద నాయకులు ఇకపై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోరని... రాజ్యసభకు వెళతారని తాను ఒకసారి పార్లమెంటులో చెప్పానని ప్రధాని గుర్తుచేసారు. ఇలా చెప్పిన నెలరోజులకే కాంగ్రెస్ పార్టీకి చెందిన అతిపెద్ద నాయకురాలు (సోనియా గాంధీ) లోక్‌సభ నుండి నిష్క్రమించారన్నారు. ఆమె రాజ్యసభకు వెళ్లారు.... అంటే ఓటమిని ముందుగానే అంగీకరించినట్లు కదా అన్నారు. రాహుల్ గాంధీ విషయంలో కూడా తాను చెప్పినట్లు జరుగుతుందని మోదీ అన్నారు.

ఇక బిజెపిపై జరుగుతున్న ప్రచారంపైనా ప్రధాని స్పందిస్తూ... చాలాకాలంగా బీజేపీ అంటే అగ్రవర్ణాల పార్టీ అనేలా పరిస్థితిని సృష్టించారు... కానీ నిజం ఏమిటంటే బిజెపిలోనే అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సభ్యులు ఉన్నారని తెలిపారు. తన మంత్రివర్గంలోనే గరిష్ట సంఖ్యలో ఓబీసీలు ఉన్నారన్నారు. దీంతో బీజేపీ అర్బన్ పార్టీ అనే మరో కథనాన్ని సృష్టించారు... కానీ ఇప్పుడు గ్రామాల్లోనే బిజెపి బలంగా వుంది... గ్రామీణ ప్రజలే ఎక్కువగా పార్టీవెంట వున్నారన్నారు. దీంతో ఈసారి బీజేపీపై సంప్రదాయ పార్టీగా ముద్రవేసారు... ఈ పార్టీ కొత్తగా ఏమీ ఆలోచించదని అంటున్నారన్నారు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ఉద్యమానికి ఎవరైనా నాయకత్వం వహిస్తున్నారంటే అది బీజేపీ పాలక ప్రభుత్వమేనని అన్నారు. కాబట్టి బిజెపిని అడ్డుకునేందుకు ప్రచారం జరుగుతున్న కథనాలన్ని అపోహలు మాత్రమేనని ప్రధాని మోదీ అన్నారు. 

ఇక తెలంగాణ విషయానికి వస్తే బిజెపి ఓట్ల శాతం ఇప్పుడు రెండింతలు పెరిగినట్లు మోదీ పేర్కొన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాదిలో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచిందని... అత్యధిక ఎంపీలు బీజేపీకి చెందినవారేనని అన్నారు. గతంతో పోలిస్తే 2024లో ఓట్ల శాతం చాలా పెరుగుతుందని నమ్ముతున్నానని అన్నారు. 

దక్షిణాది ప్రభుత్వాల గుర్తింపు ఏమిటి? కాంగ్రెస్ అయినా, ఎల్‌డీఎఫ్ అయినా, డీఎంకే అయినా అన్ని చోట్లా వుందా? అని ప్రశ్నించారు. ఈ రోజు బిజెపి పుదుచ్చేరిలో అధికారంలో ఉంది... ఇది దక్షిణాదిలో ఉందికదా... అన్నారు.  ఎక్కువగా దక్షిణాది వారు, బెంగాలీ నివసించే అండమాన్ నికోబార్‌లో బిజెపి ఎంపీ విజయం సాధించారని ప్రధాని తెలిపారు. 

 అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ క్రతులు జరుగుతున్నపుడు దక్షిణాదిన పర్యటించాను... అప్పుడు అక్కడి ప్రజలు తనపై చూపిన ప్రేమ మరియు  విశ్వాసం అపూర్వమైనదని ప్రధాని అన్నారు. కాబట్టి ఇప్పుడు భ్రమలన్నీ తొలగిపోతాయి...  అతి త్వరలోనే చాలామంది దక్షిణాది బిజెపి నేతలకు కూడా వారి ప్రజలకు సేవ చేసుకునే అవకాశం దక్కుతుందన్నారు.  చాలా ఎక్కువమందికి తనతో కలిసి పార్లమెంట్ లో పనిచేసే అవకాశం దక్కుతుందన్నారు. దక్షిణాదిన  ఓట్ షేర్ కూడా గణనీయంగా పెరుగుతుందని ప్రధాని మోదీ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios