Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ గాంధీ వారసత్వ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా.?

Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం నాడు రాయబరేలి పార్లమెంటు స్థానం నుండి నామినేషన్ దాఖలు దాఖలు చేశారు. పార్టీ సీనియర్ నేతలతో కలిసి ర్యాలీగా వెళ్లి ఆయన రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ క్రమంలో ఆయన ఆస్తులు,అప్పులు వివరాలు ఏంటో తెలుసుకోవాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ రాహుల్ ఆస్తిపాస్తులెన్నో మీరు కూడా ఓ లూక్కేయండి.

Rahul Gandhi Declares Assets Worth Over Rs 20 Crore KRJ
Author
First Published May 4, 2024, 9:28 AM IST

Rahul Gandhi:  దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి జోరుగా సాగుతుంది. ఈ తరుణంలో ఎన్నికల బరిలో నిలిచిన ఆయా పార్టీల అగ్రనేతలు, నాయకులు తమ నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం నాడు రాయబరేలి పార్లమెంటు స్థానం నుండి నామినేషన్ దాఖలు దాఖలు చేశారు. పార్టీ సీనియర్ నేతలతో కలిసి ర్యాలీగా వెళ్లి ఆయన రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. దీంతో ఆయన ఆస్తులు,అప్పులు వివరాలు ఏంటో తెలుసుకోవాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. 

రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేసిన వివరాల ప్రకారం ఆయనకు రూ. 9.24 కోట్ల చిరాస్తులు, రూ. 11. 14 కోట్ల సిరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. అంటే దాదాపు 20 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు వెల్లడించారు. ఇందులో రూ.3,81,33,572 విలువైన షేర్లు, రూ.26,25,157 బ్యాంక్ బ్యాలెన్స్, రూ.15,21,740 బాండ్లు సహా రూ.9,24,59,264 చరాస్తులు ఉండగా.., రూ.11,15,02,598 ల స్థిరాస్తులు ఉన్నట్టు రాహుల్ గాంధీ ప్రకటించారు. 

అలాగే.. తన ఆస్తులలో రూ.9,04,89,000 విలువైన స్వీయ ఆర్జిత ఆస్తులు ఉండగా.. రూ.2,10,13,598 విలువైన వారసత్వ ఆస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. అలాగే.. తన వద్ద రూ.55,000 నగదు ఉందని, రూ.49,79,184 అప్పులు ఉన్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నామినేషన్ పత్రాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో రాహుల్ గాంధీ వార్షిక ఆదాయం దాదాపు కోటీ రూపాయాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే.. న్యూ ఢిల్లీలోని సుల్తాన్‌పూర్, మెహ్రౌలీ గ్రామంలోని వ్యవసాయ భూమి, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిపి ఉమ్మడిగా కలిగి ఉన్న సుమారు 3  ఎకరాలు.. గురుగ్రామ్‌లోని సిగ్నేచర్ టవర్స్‌లో 5,838 చదరపు అడుగుల విస్తీర్ణంలో కామర్షియల్ అపార్ట్‌మెంట్లు, వాటి విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ₹ 9.05 కోట్లుగా ఉన్నట్టు ప్రకటించారు. 

రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాల నుండి ఎంఫిల్ పట్టా పొందారు. ఆయన ఫ్లోరిడాలోని రోలిన్స్ కాలేజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ చేశారు. తనపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేసిన పరువు నష్టం కేసులు, అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌తో సంబంధం ఉన్న 18 కేసులు నమోదయ్యాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios