Asianet News TeluguAsianet News Telugu

పాక్ విమానాన్ని కూల్చేసిన ఎయిర్‌ఫోర్స్: తప్పించుకున్న పైలట్

సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో పాక్ సైన్యం భారత్‌పై ఊగిపోతోంది. ఏదో ఒకటి చేసే వరకు ఆ దేశ సైన్యానికి నిద్ర పట్టేలా కనిపించడం లేదు. దీంతో బుధవారం ఉదయం పాక్ వైమానిక దళానికి చెందిన రెండు ఎఫ్-16 యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి ప్రవేశించాయి.

Indian air force shot down pakistan's f-16 at Lam valley, Nowshera sector
Author
New Delhi, First Published Feb 27, 2019, 12:33 PM IST

సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో పాక్ సైన్యం భారత్‌పై ఊగిపోతోంది. ఏదో ఒకటి చేసే వరకు ఆ దేశ సైన్యానికి నిద్ర పట్టేలా కనిపించడం లేదు. దీంతో బుధవారం ఉదయం పాక్ వైమానిక దళానికి చెందిన రెండు ఎఫ్-16 యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి ప్రవేశించాయి.

నియంత్రణ రేఖను దాటి సుమారు 3 కిలోమీటర్లు చొచ్చుకువచ్చాయి. పాక్ నుంచి ప్రతిఘటన ఎదురవుతుందని ముందే ఊహించిన ఎయిర్‌ఫోర్స్ వాటిని వెంటాడాయి. ఈ క్రమంలో లాంబ్ వ్యాలీలో పాక్ యుద్ధ విమానాన్ని కూల్చేశాయి.

భారత గగనతలంలోకి ప్రవేశించినందునే ఎఫ్-16 విమానాన్ని కూల్చివేసినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించింది. పాక్‌కు చెందిన పైలట్ ప్యారాచూట్ సాయంతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి తప్పించుకుని పారిపోయినట్లు సైన్యం తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios