Asianet News TeluguAsianet News Telugu

గుజ్జర్ల ఆందోళన హింసాత్మకం: నలుగురు పోలీసులకు గాయాలు

విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోరుతూ రాజస్థాన్‌లో గుజర్లు  చేపట్టిన ఆందోళన ఆదివారం నాడు హింసాత్మకంగా మారింది. పోలీసులు, ఆందోళనకాలరుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఆందోళనకారుల దాడిలో నలుగురు పోలీసులు గాయపడ్డారు.

Gujjar quota stir turns violent in Rajasthan's Dholpur, 4 cops injured
Author
Rajasthan, First Published Feb 10, 2019, 5:03 PM IST


జైపూర్: విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోరుతూ రాజస్థాన్‌లో గుజర్లు  చేపట్టిన ఆందోళన ఆదివారం నాడు హింసాత్మకంగా మారింది. పోలీసులు, ఆందోళనకాలరుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఆందోళనకారుల దాడిలో నలుగురు పోలీసులు గాయపడ్డారు.

పోలీసులు, ఆందోళనకారులపై మధ్య ఘర్షణతో దోల్పూరు హైవే‌ రణ రంగంగా మారింది. జాతీయ రహదారిని నిర్భంధించిన నిరసనకారులు పలు వాహనాలకు నిప్పంటించారు. సవోయి మధోపూర్ జిల్లాలో  కూడ  గుజ్జర్లు మూడో రోజు ఆందోళన నిర్వహించారు.

ఇవాళ కూడ గుజ్జర్లు రైలు పట్టాలపై ధర్నా నిర్వహించి కోటా కోసం డిమాండ్‌ను నెరవేర్చాలని ఆందోళనలు నిర్వహించారు. గుజ్జర్ల ఆందోళనలతో వెస్ట్ సెంట్రల్ రైల్వే గత రెండు రోజులుగా పలు రైళ్లను దారి మళ్లించారు. 

తమకు తక్షణమే ప్రత్యేక కేటగిరి కింద 5 శాతం రిజర్వేషన్లను ప్రకటించాలని గుజ్జర్లు డిమాండ్ చేస్తున్నారు.రాజస్థాన్ ప్రభుత్వం గతంలో గుజ్జర్లకు అత్యంత వెనుకబడిన వర్గాల కోటా కింద ఒక శాతం రిజర్వేషన్ ప్రకటించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios