Asianet News TeluguAsianet News Telugu

ఆప్ ఖాతాల్లోకి 16 మిలియన్ డాలర్లు: కేజ్రీవాల్ పై ఖలీస్తానీ పన్నూన్ సంచలన ఆరోపణలు

ఖలీస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఆప్ పై ఆరోపణలు చేశారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన  అరవింద్ కేజ్రీవాల్ పై ఈ ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

EXPLOSIVE! Pannun claims Khalistanis funded AAP with $16 million, Kejriwal offered Bhullar's release (WATCH) lns
Author
First Published Mar 25, 2024, 12:38 PM IST

న్యూఢిల్లీ:  ఖలీస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్  పన్నూన్  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఆరోపణలు చేశారు.  2014, 2022 మధ్య ఖలీస్తానీ గ్రూపులు  ఆప్ ఖాతాలో  16 మిలియన్ డాలర్లను జమ చేశారని  ఆరోపణలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పన్నూన్  ఓ వీడియోను విడుదల చేశారు.

 

దేవిందర్ పాల్ సింగ్ భుల్లర్ ను విడుదల చేయాలని  ప్రతిపాదన చేసినట్టుగా పన్నూన్  తెలిపారు. ఇందుకు గాను  ఈ నగదునుఇచ్చారని ఆయన ఆరోపించారు.1993 లో ఢిల్లీ బాంబ్ పేలుడు ఘటనలో  భుల్లర్ చిక్కుకున్నాడు.

2014లో న్యూయార్క్ లోని గురుద్వారా రిచ్ మండ్ హిల్స్ లో కేజ్రీవాల్, ఖలిస్తాన్ అనుకూల సిక్కుల మధ్య రహస్య సమావేశం జరిగిందని  పన్నూన్ ఆరోపించారు. ఈ సమావేశంలోనే ఈ విషయమై ప్రతిపాదన జరిగిందని ఆయన ఆరోపించారు.  భుల్లర్ ను విడుదలకు కేజ్రీవాల్ హామీ ఇచ్చారని పన్నూన్  చెప్పారు.  ఈ మేరకు ఆర్ధిక సహాయం కోరినట్టుగా పన్నూన్ పేర్కొన్నారు.

ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఈ అంశం వెలుగు చూసింది. జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతుగా  ఆప్  త్వరలోనే మేన్ భి కేజ్రీవాల్ ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. మరో వైపు ఈ నెల  31న ఇండియా కూటమి ఢిల్లీలోని రాంలీలా మైదాన్ లో ర్యాలీ చేయాలని తలపెట్టింది.  ఈ ర్యాలీని విజయవంతం చేసేందుకు గాను  ఈ నెల  26న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలను నిర్వహించాలని ఆప్ నిర్ణయం తీసుకుంది.

ఈ నెల  27,28 తేదీల్లో  ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు  జోనల్ స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు.ఈ నెల  31న రామ్ లీలా మైదానంలో నిర్వహించే  ర్యాలీలో  ప్రతి పోలింగ్ బూత్ నుండి  10 మంది పాల్గొనేలా చూడాలని ఆప్ నిర్ణయం తీసుకుంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios