Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ మెట్రోలో రంగులు చల్లుకున్న ఇద్దరు యువతులు: సోషల్ మీడియాలో వీడియో వైరల్


ఢిల్లీ మెట్రో రైలులో  ఇద్దరు మహిళలు  రంగులు చల్లుకుంటున్న వీడియో  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Delhi Metro:Women's Holi Celebration Turns 'Cringe' As They Sleep Over Each Other in Viral Video lns
Author
First Published Mar 24, 2024, 11:05 AM IST

న్యూఢిల్లీ: హోలీ అంటే రంగుల పండుగ. హోలీ రోజున  రంగులు చల్లుకుంటూ  సంబరాలు చేసుకోవడం సంప్రదాయం.అయితే ఢిల్లీ మెట్రో రైలులో ఇద్దరు మహిళలు  రంగులు చల్లుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది.  

ఢిల్లీ మెట్రో రైలులో  ఇద్దరు మహిళలు రంగులు చల్లుకున్న  వీడియోపై చర్చ సాగుతుంది. ఓ మహిళ తెల్లటి దుస్తులు ధరించింది. మరో మహిళ తెల్లటి చీర ధరించింది.  మెట్రో రైలు ఫ్లోర్ లో వీరిద్దరూ కూర్చుని రంగులు పూసుకున్నారు.  అంట్ లగా దే పాటకు అనుగుణంగా  ఒకరికొకరు రంగులు పూసుకున్నారు.  ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయగానే వైరల్ గా మారింది. 

 

రైలులో  ఇలాంటి ఘటనను ప్రత్యక్షంగా చూడాల్సి వచ్చింది. దీన్ని ఆపేందుకు ఎవరూ ఏమీ చేయలేకపోయినందుకు తాను చింతిస్తున్నానని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ మెట్రో ఇప్పుడు ఓయో లాంటి సౌకర్యాలను ఉచితంగా అందిస్తుందని మరొక నెటిజన్ సెటైరికల్ కామెంట్స్ చేశారు.  ఢిల్లీ మెట్రోలో  ఇలా  వ్యవహరించిన వారికి జరిమానా విధించాలని  మరొక నెటిజన్ డిమాండ్ చేశారు.

మెట్రో రైలులో ఇలాంటి  ఘటనలపై ఢిల్లీ మెట్రో రైలు  తీవ్రంగా ఖండించింది. ప్రయాణీకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని  గతంలో సూచించింది. కానీ,ఈ విషయమై  ఢిల్లీ మెట్రో రైలు  స్పందించలేదు.ఇదిలా ఉంటే  ఈ వీడియోను టెక్నాలజీ ఉపయోగించి చేశారా.. లేదా నిజంగానే ఈ వీడియోను  ఢిల్లీ మెట్రో రైలులో  రికార్డు చేశారా అనే విషయమై  సోషల్ మీడియాలో చర్చ సాగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios