Asianet News TeluguAsianet News Telugu

వామ్మో ఏందయ్యా ఇది.. నేను ఎప్పుడు చూడలేదు!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి బరిలో నిలిచిన అభ్యర్థులు నానాతంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.  అలాగే.. రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది.

BJP candidate kisses woman in Bengal during campaign, viral pic triggers row krj
Author
First Published Apr 10, 2024, 6:59 PM IST

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి బరిలో నిలిచిన అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఏ తరుణంలో ఎన్నో చిత్ర విచిత్ర ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా నార్త్ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థి ఖగెన్ ముర్ము వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాష్ట్రంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఈ వీడియోను ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో షేర్ చేయడం ద్వారా బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. 

అసలేం జరిగిందంటే? 

బెంగాల్ లోఎని నార్త్ మాల్దా లోక్ సభకు బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్మూ  పోటీచేస్తున్నారు. ఏప్రిల్ 8 న సోమవారం నాడు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని శ్రిహిపూర్ గ్రామంలో ప్రచారానికి వెళ్లారు. ఈ ప్రచారంలో ఓ యువతిని నుదుటిపై పెట్టుకున్నారు. ఈ వీడియోను బీజేపీ అభ్యర్థి ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసింది. కానీ, తర్వాత దాన్ని తొలగించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన  ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది.
 
టీఎంసీ తీవ్రంగా ఖండించింది
 
టీఎంసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దులాల్ సర్కార్ మాట్లాడుతూ .. ఈ సంఘటనను ఖండించారు. ఇది బెంగాలీ సంస్కృతికి విరుద్ధమని, అభ్యర్థులు ఓట్లు అడిగేటప్పుడు ఇలాంటి పని జరిగిందా? అని ప్రశ్నించారు.

  
ఆమె నా బిడ్డ లాంటిది
 
వైరల్ వీడియోపై స్పందిస్తూ బీజేపీ అభ్యర్ధి ముర్ము స్పందించారు. ఈ వీడియోను తృణమూల్‌కు చెందిన ఎవరో పోస్ట్ చేశారని, ఆ వీడియోలో మార్పులు చేశారని అన్నారు. ఇది వారి ముర్ఖ   మనస్తత్వానికి అద్దం పడుతోందనీ, చెంపపై ముద్దులు పెట్టుకుంటున్న అమ్మాయి మా కుటుంబానికి చెందిన కూతురు. మా పనివాళ్ళ కూతురు బెంగళూరులో నర్సింగ్ చదువుతోంది. తాము వారిని  మా స్వంత పిల్లల్లాగే ప్రేమించామనీ, ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ  పక్కనే నిలబడి ఉన్నారనీ, ఈరోజు కూడా ఆ ప్రాంతంలోనే ప్రచారం చేస్తున్నాను. ఎవరూ దానిని చెడుగా భావించలేదు. తృణమూల్ ఓట్ల కోసం తహతహలాడుతోందని అన్నారు. టీఎంసీపై ఫిర్యాదు చేస్తానని ముర్ము తెలిపారు. ఇంకా చిన్నపిల్లల్ని ముద్దుపెట్టుకోవడంలో తప్పేమీ లేదన్నారు. వారిది 

Follow Us:
Download App:
  • android
  • ios