Asianet News TeluguAsianet News Telugu

దేశంలో మతపరమైన అల్లర్లు.. మరీ.. సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టుల దారెటు..?

దేశంలో మతపరమైన అల్లర్లు జరగడం కొత్తేమీ కాదు. ఇటీవల రామనవమి నాడు దేశంలోని పలు ప్రాంతాల్లో మతపరమైన హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.  ప్రస్తుత పరిస్థితుల్లో  రాష్ట్రంలో విభజన రాజకీయాలను కొనసాగించడంలో రాజకీయ పార్టీలు ఆసక్తి వుండడంతో పాటు మత విభజనను, ఘర్షణలను సృష్టించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో మీడియా, ఏ వైపు ఉంది.  

Bihar Sharif violence Activists, journalists are dividing people further..KRJ
Author
First Published Apr 8, 2023, 3:36 PM IST

దేశంలో మతపరమైన అల్లర్లు జరగడం కొత్తేమీ కాదు. ఇటీవల రామనవమి నాడు దేశంలోని పలు ప్రాంతాల్లో మతపరమైన హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.  ఈ క్రమంలో బీహార్ లోని నలంద జిల్లా బీహార్ షరీఫ్ పట్టణంలో తలెత్తిన మతపరమైన హింసాత్మక సంఘటనలో ఒకరు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. కోట్ల విలువైన ఆస్తి ధ్వంసమైంది. ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొందని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలు జరుగుతున్నాయి. 
 
ఇలాంటి మతమైన ఘర్షణల వెనుక ప్రధానంగా రెండు కారణాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తారు. 1. తమ ధృవీకరణ కోసం రాజకీయ నాయకులు మతపరమైన అల్లర్లను ప్రేరేపించడం. 2, దేశాన్ని బలహీనపరిచేందుకు భారత వ్యతిరేక శక్తులు మతపరమైన శత్రుత్వాన్ని ప్రోత్సహించడం. ఈ రెండు సందర్భాల్లో హిందువులు, ముస్లింల మధ్య మతపరమైన అల్లర్లు సృష్టించబడుతున్నాయి.  

అసలు హింస అనేది ప్రజలను విభజించే ప్రక్రియలో ఒక భాగంగా మారింది. ఈ ప్రక్రియలో జర్నలిస్టులు, నాయకులు కీలక పాత్ర పోషిస్తారు. మతపరమైన బాధితుల మనోగతాన్ని ప్రచారం చేయడంలో వీరు వారధులుగా వ్యవహరిస్తారు. అయితే.. వీరు ఒక కమ్యూనిటీని బాధితురాలిగా,మరొకటి నేరస్థుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వీరు ఒకే వర్గానికి మద్దతుగా నిలబడి .. వారినే  బాధితులుగా గురించి నివేదిస్తారు. అయితే.. ఇతరుల గురించి చర్చించకుండా.. మౌనం వహిస్తారు. ఇదిలా ఉంటే.. కార్యకర్తలు లేదా పార్టీ నాయకులు ఒక వర్గానికి మద్దతుగా ప్రచారాలను ప్రారంభిస్తారు. మరొక వర్గాన్ని విస్మరిస్తారు.

తాజాగా మతపరమైన అల్లర్లకు బీహార్ లోని  షరీఫ్ కేంద్రంగా మారింది. ఇక్కడి మదర్సాలో ఉన్న హెరిటేజ్ లైబ్రరీని తగలబెట్టడం జరిగింది. కానీ ఈ విషయంపై వారు (జర్నలిస్టులు, నాయకులు) మౌనంగా వ్యవహరిస్తే.. గుల్షన్ కుమార్ హత్య గురించి రాస్తున్నారు. మాట్లాడుతున్నారు. ఇతర వ్యక్తుల సమూహం ఒక హిందూవును హత్య చేయడంతో పాటు మదర్సా దహనంపై ఏకవచనంతో( చాలా తక్కువ) దృష్టి సారిస్తున్నారు. మరోవైపు.. ఢిల్లీకి చెందిన కొందరు 'కార్యకర్తలు' బీహార్ షరీఫ్‌కు చేరుకుని 'అల్లర్ల బాధితుల'కు సహాయం చేసేందుకు నిధుల సేకరణ కోసం పిలుపునిచ్చారు. ఈ ప్రయత్నాలు , కార్యక్రమాలు ద్వేషాన్ని ఓడించడం లేదా ఎదుర్కోవడం లక్ష్యంగా ఉంటే దానిని స్వాగతించవచ్చు. కానీ, కొన్ని సందర్బాల్లో మతపరంగా విభజనను ప్రభావితం చేస్తున్నారు. విద్వేషాలను పెంచేలా ఉన్నాయి. 

న్యూఢిల్లీకి చెందిన ప్రముఖ 'సామాజిక కార్యకర్త' ఆసిఫ్ ముజ్తబా తన ఎన్జీవో కోసం విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అతను సోషల్ మీడియాలో ఇలా వ్రాశాడు. “ముస్లింలకు డబ్బు ద్వారా లేదా న్యాయాన్ని నిర్ధారించడం ద్వారా న్యాయంగా పరిహారం ఇవ్వబడలేదు. మన (మసీదులు) పుణ్యక్షేత్రాల నష్టాన్ని భర్తీ చేయడంలో కూడా రాష్ట్రం విఫలమైంది. ఈ సమయంలో కోల్పోయిన జీవనోపాధి కోసం తగినంత నిధులను సేకరించడం అనివార్యం. నిధుల సేకరణ, వారి జీవనోపాధిని పునర్నిర్మించడం ద్వారా.. వారికి కొంత ఉపశమనం కల్పించవచ్చని నమ్ముతున్నాం “. అని పేర్కొన్నారు.

 ఈ ఫండ్ ముస్లింల నుండి, ముస్లింల కోసం సమీకరించబడుతుందని స్పష్టమైంది. ముస్లింలలో కమ్యూనిటీ భావాన్ని నింపడమే లక్ష్యం. భారతదేశంలోని కమ్యూనిటీలు, తమ సమస్యలను ఒంటరిగా చూసుకోవాలని దీని అర్థం కాదా?.. మతవాదులను తిప్పికొట్టాలంటే.. భారతదేశం భారతీయులందరికీ చెందినదని ప్రజలు భావించాలి. హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా.. అల్లర్ల బాధితులను ఆదుకోవాలి. అలాగే.. మత ప్రమేయం లేకుండా నేరస్థులను శిక్షించబడాలి. 

ఢిల్లీకి చెందిన మీర్ ఫైసల్ అనే జర్నలిస్టు మరింత సమతుల్య విధానాన్ని అవలంబించారు. నిధులు సేకరించవద్దని ప్రజలను కోరారు. ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. అన్నింటికంటే.. బాధితులు ఈ దేశ పౌరులు, వారి జీవిత, ఆస్తుల రక్షణ ఈ దేశ ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఆయన సోషల్ మీడియా వేదికగా ఇలా రాశారు. “బీహార్ లోని షరీఫ్, మదర్సా బాధితుల కోసం నిధులు సేకరించమని చాలా మంది నన్ను కోరారు. ప్రతిసారీ భావోద్వేగానికి లోనయ్యే బదులు, మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఇవ్వడానికి బదులుగా. ప్రజలకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి చేయరు? ఈ సమయంలో మీరు మీ పొరుగున ఉన్న వారిని విరాళాలు ఇవ్వడం ద్వారా వారికి మద్దతు ఇవ్వాలి." అని పేర్కొన్నారు.  

విభజన ఎజెండా ముస్లింల గుత్తాధిపత్యం కాదు. హిందువులపై ముస్లింలు దాడి చేశారని కొందరు 'సామాజిక కార్యకర్తలు' పేర్కొన్నారు. ప్రతి బాధితుడు హిందువే అయితే.. అల్లరిమూకలందరూ ముస్లింలు అని హిందువులు నమ్మాలని ఈ వ్యక్తులు కోరుకుంటున్నారు. బీహార్ ప్రధాన కార్యదర్శి ముస్లిం అయినందున హిందువులను లక్ష్యంగా చేసుకుంటున్నారని సోషల్ మీడియా ప్రభావశీలుడు పరోక్షంగా పేర్కొన్నాడు. 

మరో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ బాలా ట్వీట్ చేస్తూ.. "భారతదేశం అమృత్ కాల్‌లో ప్రవేశించినప్పటికీ, బీహార్ ఇప్పటికీ 1947లో ఇరుక్కుపోయింది, ఇక్కడ హిందువులు తాము ఎక్కడ చంపబడతారేమో అనే భయంతో తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించడం లేదు. ఈ కార్యకర్తలు భారతీయ సమాజాన్ని రెండు శిబిరాలుగా విభజిస్తున్నారు. అల్లర్ల బాధితులకు సహాయం చేయాలి తప్ప 'ముస్లిం' లేదా 'హిందూ' అల్లర్ల బాధితులకు కాదు. మనం అల్లరి మూకలను గుర్తించాలి తప్ప 'హిందూ అల్లర్లు' లేదా 'ముస్లిం అల్లర్లు' కాదు. గుల్షన్ హత్యకు గురయ్యాడు, అతనికి న్యాయం చేయాలి. అతని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి హంతకులను శిక్షించాలి. హెరిటేజ్ మదర్సా, దాని లైబ్రరీ దగ్ధమైంది. దానికి మరమ్మతులు చేసి నిప్పంటించిన వ్యక్తులను శిక్షించాలి. అల్లర్లను, బాధితులను మత దృక్కోణంలో చూడకూడదు. మనం మతవాదాన్ని ఓడించలేము. అల్లర్ల కారణులు సమాజాన్ని  ముస్లింలుగా లేదా హిందువులుగా విభజించాలని భావిస్తున్నారు. కానీ, వారందరిని భారతీయులుగా కాదు." అని పేర్కొన్నారు.


రచయిత - సాకిబ్ సలీం

Follow Us:
Download App:
  • android
  • ios