Asianet News TeluguAsianet News Telugu

Traffic Challans: సూపర్ లేడీ..! 270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘన.. స్కూటీపై ఏకంగా రూ.1.36 లక్షల జరిమానా.. 

Traffic Challans: బైక్, కారు, స్కూటీ పై పోలీసులు ఫైన్ వేస్తే వాటి విలువ ఎంత ఉంటుందని అనుకుంటున్నారు. మహా అయితే రూ.3 నుంచి రూ.4 వేల మధ్య ఉంటుంది. అదే కొన్ని రోజులుగా పెండింగ్ లో ఉన్న ఫైన్లు అయితే రూ.20-30 వేల మధ్య ఉంటుంది కదా.. కానీ ఓ మహిళ స్కూటీపై ఉన్న ఫైన్లు ఏకంగా ఒక లక్షా ముప్పై వేలకు దాటాయి. ఆ స్టోరీ ఏంటో తెలియాలంటే ఇది చదివేయండి..
 

Bengaluru Woman Fined rs 1.36 Lakh For Violating Traffic Rules 270 Times Krj
Author
First Published Apr 17, 2024, 10:50 PM IST

Traffic Challans: ప్రమాదాలు జరగకుండా..  సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలంటే.. ట్రాఫిక్ రూల్స్ ను అందరూ తప్పకుండా పాటించాలి. కానీ, కొందరు ఆ ట్రాఫిక్ రూల్స్ ను అస్సలు పాటించరు. అలాంటి వారికి చెక్ పెట్టాడానికి పోలీసులు పలు సూచనలు చేస్తారు. అయినా వినకపోతే ఫైన్లు వేస్తారు. అయినా కొందరూ ఆగతాయిలు ఏ మాత్రం లెక్క చేయకుండా ఇష్టానుసారంగా తన వాహనాలకు నడుపుతుంటారు. ఈ కోవలోకి ఓ మహిళ చేరింది.  ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు ఫైన్లు వేసిన అసలు లెక్క చేయలేదు. తన స్కూటీతో ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేస్తూనే ఉంది. ఎట్టకేలకు  ఆమె పోలీసులకు చిక్కింది. ఈ తరుణంలో ఆమె స్కూటీపై పడిన ఫైన్ లు చూసి పోలీసులే షాక్ అయ్యారు. ఈ విషయం సోషల్ మీడియాకు రావడంతో నెటిజన్లు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళలు వాహనాలు నడపడంలో కాస్త జాగ్రత్తగా ఉంటారు. ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటిస్తారు. కానీ కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన మహిళ మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తించారు. ఇష్టమొచ్చినట్టు తన స్కూటీని నడిపారు. చివరికి ఇబ్బందుల్లో పడ్డారు. ఏకంగా ఆమె స్కూటీపై రూ.1.36 లక్షల ఫైన్లు ఉండటం చూసిన పోలీసులు 
షాకవుతున్నారు. ఇప్పుడు ఆ మహిళ లబోదిబోమంటుంది. 

ఎలా వెలుగులోకి వచ్చిందంటే ? 

బెంగళూరు సిటీకి చెందిన ఓ మహిళ తన స్కూటీపై నగరంలోని రోడ్లపై తిరుగుతూ ట్రాఫిక్ రూల్స్ ను పదే పదే బ్రేక్ చేశారు. ఆమె యాక్టివా స్కూటీపై ట్రిపుల్ రైడింగ్ చేయడంతో పాటు రాంగ్ సైడ్ లో పలు మార్లు బండి నడిపారు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేశారు. చాలా సార్లు సిగ్నల్ కూడా జంప్ చేశారు. ఫోన్ మాట్లాడుతూ కూడా బండి నడిపారు. నగరంలోని పలు సీసీటీవీ కెమెరాల్లో ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా స్కూటీపై వెళ్తున్న ఆమె కదలికలను పోలీసులు రికార్డు చేశారు. ఆమె ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినప్పుడల్లా ఫైన్లు వేశారు. ఇలా ఆమెపై స్కూటీపై  270 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. పెండింగ్ చలాన్లు క్లియర్ చేసే క్రమంలో పోలీసులు ఆమె స్కూటీపై ఉన్న ఫైన్లను కూడా చూశారు. ఏకంగా వాటి విలువ రూ.1.36 లక్షలు ఉండటంతో ఖంగు తిన్నారు. వెంటనే ఆమెకు ఆమెకు నోటీసులు పంపి తన స్కూటర్ పై పెండింగ్ లో ఉన్న చలాన్లన్నింటినీ క్లియర్ చేయాలని కోరారు. దానికి కూడా ఆమె స్పందించకపోవడంతో చివరికి ఆ స్కూటీని సీజ్ చేశారు.

వాస్తవానికి ఆమె నడిపే యాక్టివా స్కూటీ ధర కూడా ఒక లక్షా 36 వేలు ఉండదు. ఆ స్కూటీ విలువ కంటే ఫైన్ లే ఎక్కువగా ఉండటంతో ఏం చేయాలో తోచక ఆమె ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలోకి రావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మరి ఆమె ఇప్పుడు స్కూటీని విడిపించుకుంటాదా లేదా ?.. ఇన్ని ఫైన్లు పడేదాక ఆమె ఏం చేసింది..? ఇదెక్కడి మాస్ రా మావా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios